Advertisement
Advertisement
Abn logo
Advertisement

బలవంతపు వసూళ్లు తగదు

   గౌరవ సభలకు అనూహ్య స్పందన 

 సాలూరు: ఓటీఎస్‌ పేరిట బలవంతపు వసూళ్లు తగదని టీడీపీ నాయకులు అన్నారు. పార్టీ జాతీయ నాయకుడు చంద్రబాబునాయుడు పిలుపుమేరకు పట్టణం లోని మూడో వార్డులో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారా ణి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ ఆధ్వర్యంలో గురువా రం గౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ శ్రేణులు వార్డులో పర్యటించారు. ఓటీఎస్‌కు ఎట్టి పరిస్థితిలో డబ్బులు చెల్లించవద్దని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు నిమ్మాది తిరుపతిరావు, పప్పల మోహన్‌, బొత్స ఈశ్వరరావు పాల్గొన్నారు. 

 పార్వతీపురం రూరల్‌: వైసీపీకి అధికారం శాశ్వతం కాదని ఆ పార్టీ నాయకులు తెలుసుకోలసిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు అన్నారు. తాళ్లబురిడి గ్రామంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం గౌరవసభ నిర్వహించారు. ఈసందర్భంగా వీరిరువురు మాట్లాడుతూ శాసనసభలో వైసీపీ నాయకులు ప్రజల సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని, ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు ప్రారంభించ లేదని, చెరకు రైతులకు చెల్లించా ల్సిన బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. దొగ్గ మోహన్‌, బార్నాల సీతారాం, గొట్టాపు వెంకటనాయుడు, బోను దేవీచంద్రమౌళి, జాగా న రవిశంకర్‌, గొంగాడ రామ్మూర్తి, బేత లక్ష్మణరావు, రెడ్డి శ్రీనివాసరావు, బడే గౌరు నాయుడు, కె.ప్రదీప్‌, గర్భాపు ఉదయభాను, శ్రీరాములు, యాండ్రాపు చినరామ్మూర్తి నాయుడు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


  

 

Advertisement
Advertisement