Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోదీ దేశాభివృద్ధిని అమ్ముకుంటున్నారు: Chinta mohan

రాజమండ్రి: ప్రధాని మోదీ దేశాభివృద్ధిని అమ్ముకుంటున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పాలనలో పెట్రోల్, డీజీల్, నిత్యావసర వస్తువుల ధరలు పెరగటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోదీ 16 వేల కోట్లు ఖర్చు చేసి రెండు విమానాలు కొనుగోలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో సోషలిజాన్ని అమ్మి.... క్యాప్టలిజాన్ని మోదీ ప్రోత్సహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీలో దొంగ ఓట్లు వేయించుకుని వైసీపీ ఎన్నికల్లో గెలుస్తున్నారని అన్నారు. చంద్రబాబు సొంత ఓట్లు కూడా వేయించుకోలేని పరిస్థితి ఏపీలో ఉందని తెలిపారు.  ఏపీలో 80 లక్షల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు సంక్రాంతిలోపు స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ పైనాన్స్ కార్పోరేషన్ వెంటనే పునరుద్ధరించాలన్నారు. 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలని చింతా మోహన్ పేర్కొన్నారు. 


Advertisement
Advertisement