అడవిలో ఉన్న ఈ భూత్ బంగ్లాను రూ.3కోట్లకు కొన్న ఆ నలుగురు ఫ్రెండ్స్‌ను అంతా పిచ్చోళ్లన్నారు.. ఇప్పుడదే..
ABN , First Publish Date - 2021-08-02T00:36:40+05:30 IST
వందేళ్ల క్రితం తన వధువుకు గిఫ్ట్‌గా ఇవ్వడం కోసం ఒక ధనవంతుడు కట్టాడా భవనాన్ని. ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ కేత్ మిల్లర్ వంటి వారికి ఆ భవనంలో ఆతిథ్యం ఇచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: వందేళ్ల క్రితం తన వధువుకు గిఫ్ట్‌గా ఇవ్వడం కోసం ఒక ధనవంతుడు కట్టాడా భవనాన్ని. ఒకానొక సందర్భంలో ఆస్ట్రేలియన్ క్రికెట్ స్టార్ కేత్ మిల్లర్ వంటి వారికి ఆ భవనంలో ఆతిథ్యం ఇచ్చారు. అలాంటిది ఆ తర్వాత అదో భూత్ బంగ్లాలా మారిపోయింది. పైకప్పులో నుంచి బయటకు పొడుచుకు వచ్చిన చెట్లు, ఊడిపడుతున్న పెంకులు, చుట్టూ మొత్తం చెట్లు.. ఇలా నిజమైన భూత్ బంగ్లాలా మారిన ఈ భవనాన్ని స్థానికులంతా ఫైర్ ఫ్లై హిల్ అని పిలిచే ఈ భవనం పేరు ‘హలాలా కాండ’. ఇది శ్రీలంకలోని వెలిగామా ప్రాంతంలో ఉంది. 1912లో దీన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆలనాపాలనా చూసేవాళ్లు లేకపోవడంతో దెయ్యాల కొంపలా మారింది.
2011లో ఈ భవనాన్ని నలుగురు మిత్రులు కొనుగోలు చేశారు. అప్పుడు తెలిసిన వాళ్లంతా ఈ మిత్రులను పిచ్చోళ్లలా చూశారు. ఈ మిత్రులు మాత్రం విమర్శలు పట్టించుకోలేదు. భవనంతోపాటు చుట్టూ ఉన్న 2 ఎకరాల స్థలాన్ని కూడా కొనేశారు. అప్పట్లో దీన్ని సుమారు 2.8 కోట్లకు కొన్నారు. ఆ తర్వాత రినోవేషన్ మొదలు పెట్టారు. చాలా టైం పట్టింది. డెమోలిషన్‌కే నాలుగు నెలలు పట్టింది. ఆ తర్వాత నెమ్మదిగా వేగం పుంజుకొంది. తోటలో ఉన్న ఒక బావి నుంచి ఈ భవనానికి నీరు అందేది. దీన్ని కూడా రినోవేట్ చేసిన డీన్ షార్ప్, బెంట్లే డి బేయర్, జెన్నీ లూయిస్ రిచర్డ్ బ్లేస్డేల్ బృందం.. ఈ భూత్ బంగ్లాను ఓ లగ్జరీ విల్లాగా మార్చేసింది. ఇప్పుడు ఈ విల్లాలో ఉండాలంటే ఒక్క రాత్రి గడపాలంటే సుమారు రూ.90వేలు చెల్లించాలి.