గిద్దలూరు, జనవరి 16 : ఆన్లైన్ ద్వారా ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా గురూజీ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 16 నుంచి 60 సంవత్సరాల వయస్సు ఉన్న స్త్రీ, పురుషులు శిక్షణ పొందవచ్చన్నారు. ఎలాంటి విద్యార్హత అవసరం లేదని, ఇంటి వద్ద నుంచే సెల్ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ పొందవచ్చని పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఆన్లైన్లో పరీక్ష పెట్టి ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు మంజూరు చేస్తామన్నారు. వివరాలకు 9441932390 సంప్రదించాలని తెలిపారు.