ఫ్రాన్స్‌లో అల్ ఖైదా అధిపతి హతం
ABN , First Publish Date - 2020-06-06T11:51:28+05:30 IST
ఫ్రాన్స్ దేశంలోని ఉత్తరమాలిలో ఫ్రెంచ్ సైనికదళాలు జరిపిన దాడిలో అల్ ఖైదా అధిపతి అబ్దేల్‌మలెక్ డ్రౌక్‌డెల్ హతమయ్యారు.....
ప్యారిస్ (ఫ్రాన్స్): ఫ్రాన్స్ దేశంలోని ఉత్తరమాలిలో ఫ్రెంచ్ సైనికదళాలు జరిపిన దాడిలో అల్ ఖైదా అధిపతి అబ్దేల్‌మలెక్ డ్రౌక్‌డెల్ హతమయ్యారు. ఇస్లామిస్ట్ పోరాటయోధుడు, ఉత్తర ఆఫ్రికా అల్ ఖైదా చీఫ్ అయిన అబ్దేల్‌మలెక్ డ్రౌక్‌డెల్ కోసం ఫ్రెంచ్ సైనికులు ఏడేళ్లుగా వేటాడుతున్నాయి. ఉగ్రవాద నాయకుడైన అబ్దేల్‌మలెక్ ఉత్తర అల్జీరియా పర్వతాల్లో దాక్కొని ఉత్తరమాలి, నైజర్, మౌరిటానియా, అల్జీరియా ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించేవాడు. ఉత్తరమాలిలో అబ్దేల్‌మలెక్ డ్రౌక్‌డెల్ ఉండగా ఫ్రెంచ్ సైనికులు దాడి చేసి మట్టుబెట్టారని ఫ్రెంచ్ సాయుధ దళాల మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ శుక్రవారం రాత్రి ట్విట్టర్‌లో రాశారు.