స్తంభించిన ట్రాఫిక్‌

ABN , First Publish Date - 2021-10-23T04:33:53+05:30 IST

జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో శుక్రవారం ఉదయం భారీ ట్రాలర్‌ ఫ్రీ లెఫ్ట్‌ రోడ్డులో మలుపు తిరిగేందుకు తగిన స్థలం లేకపోవడంతో ఇరుక్కుపోయింది.

స్తంభించిన ట్రాఫిక్‌
లంకెలపాలెం కూడలిలోని ఫ్రీ లెఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ట్రాలర్‌

లంకెలపాలెం జంక్షన్‌లోని ఫ్రీ లెఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ట్రాలర్‌ 

అరగంట పాటు వాహనచోదకుల అవస్థలు

లంకెలపాలెం, అక్టోబరు 22: జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో శుక్రవారం ఉదయం భారీ ట్రాలర్‌ ఫ్రీ లెఫ్ట్‌ రోడ్డులో మలుపు తిరిగేందుకు తగిన స్థలం లేకపోవడంతో ఇరుక్కుపోయింది. దీని వల్ల ఈ జంక్షన్‌లో ట్రాఫిక్‌ స్తంభించి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బిహార్‌ నుంచి రాంబిల్లి వెళుతున్నభారీ ట్రాలర్‌ లంకెలపాలెం కూడలిలో గల ఫ్రీ లెఫ్ట్‌ రోడ్డులో మలుపు తిప్పుతుండగా ఇరుక్కుపోవడంతో అటుగా ఫార్మాసిటీకి వచ్చే బస్సులతో పాటు వివిధ వాహనాలు నిలిచిపోయాయి. అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పరవాడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని ట్రాలర్‌ మలుపు తిరిగేందుకు వీలుగా రహదారి పక్కన ఉన్న సిమెంట్‌ బ్లాక్‌లను క్రేన్‌ సహాయంలో పక్కకు జరిపించారు. ఆ తరువాత ట్రాలర్‌ను అక్కడ నుంచి తీయించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. 

పరవాడ జంక్షన్‌లో..

పరవాడ: పరవాడ సినిమాహాల్‌ జంక్షన్‌లో శుక్రవారం ఉదయం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జంక్షన్‌ సమీపంలోని వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ ఎదురుగా రహదారిపై ఏర్పడిన పెద్ద గొయ్యి కారణంగా అందులో లారీ చక్రాలు ఇరుక్కుపోయాయి. దీంతో ట్రాఫిక్‌ స్తంభించింది. కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. సుమారు అరగంటకు పైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు లారీని అక్కడ నుంచి తరలించడంతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమైంది.


Updated Date - 2021-10-23T04:33:53+05:30 IST