ఈ నెల 14 వరకు కర్నాటకలో లాక్‌డౌన్ పొడిగింపు

ABN , First Publish Date - 2021-06-04T01:44:44+05:30 IST

కర్నాటకలో ఈ నెల 14 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌‌ను పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పాజిటివ్ కేసులు...

ఈ నెల 14 వరకు కర్నాటకలో లాక్‌డౌన్ పొడిగింపు

బెంగళూరు: కర్నాటకలో ఈ నెల 14 వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌‌ను పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల పెరుగుదల ఏమాత్రం తగ్గకపోవడం.. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలకు ఈ మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తుండడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా ఆంక్షలను కూడా సడలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అత్యవసర వస్తువులు కొనుక్కునేందుకు ఇచ్చిన సమయాన్ని కూడా పొడిగించే అవకాశాలు లేవని చెబుతున్నారు. కాగా రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 15 శాతానికి పైనే కొనసాగుతున్న నేపథ్యంలో... కనీసం మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించాలంటూ ఆరోగ్య నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్ర కొవిడ్-19 సాంకేతిక సలహా కమిటీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ఆంక్షలను సడలించాలంటే కరోనా పాజిటివిటీ రేటు 5 శాతానికి దిగిరావాలనీ.. కేసులు కూడా 5 వేల కంటే దిగువన ఉండాలని సూచించింది. 

Updated Date - 2021-06-04T01:44:44+05:30 IST