Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళుర్పిస్తున్న మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌బాబు

హనుమాన్‌జంక్షన్‌, నవంబరు 26 : భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం  సందర్భంగా  శుక్ర వారం హనుమాన్‌ జంక్షన్‌లో  మాలమహానాడు  ఆధ్వర్యంలో  మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం  బాపులపాడు మండల పరిషత్‌ కార్యాల యం, బాపులపాడులో అంబేడ్కర్‌ విగ్రహాలకు బాపు లపాడు ఎంపీపీ వై.నగేష్‌తో పాటు మాల మహానాడు  రాష్ట్ర అధ్యక్షుడు  బేతాళ  శరత్‌బాబు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా యూత్‌ అధ్యక్షుడు కొత్తూరు సాగర్‌, మాలమహానాడు  కార్యకర్తలు పెద్ద  సంఖ్యలో పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  : భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ  భారతదేశం సర్వతోముఖాభివృద్ధి సాధించడానికి డాక్టర్‌ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ ఫలితమేనని వీరవల్లి హెచ్‌ఎం నిర్మల, గ్రంథాలయాధికారి రహీంలు వేర్వేరు కార్యక్రమాల్లో తెలిపారు. వీరవల్లి, రేమల్లె, కానుమోలు, వేలేరు తదితర గ్రామాల్లో శుక్రవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీరవల్లి హైస్కూల్‌లో హెచ్‌ఎం పి.నిర్మల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమా లవేసి నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో కృష్ణారావు, రమణగోపాల్‌, క్రాంతి, తదితర ఉపా ధ్యాయులు పాల్గొన్నారు.కానుమోలు గ్రంథాలయంలో రాణా వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో గ్రంథాలయాధికారి రహీంతో కలిసి సుంకర సాంబశివరాయల్‌, విద్యార్ధులు ప్రతిజ్ఞ చేశారు.   ఈ కార్యక్రమంలో  మాజీ ఎంపీటీసీ చలమలశెట్టి వీరరాఘవయ్యపాల్గొన్నారు.

  ఉంగుటూరు  : రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మండలంలోని పలు పాఠశాలలు, గ్రంథాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మానికొండ గ్రంథాలయంలో నిర్వహించిన రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో గ్రామంలోని పీఏసీఎస్‌ చైర్‌పర్సన్‌, గ్రంథాలయాభివృద్ధి కమిటీ చైర్మన్‌ గోగినేని వెంకటేశ్వరరావు, లంకపల్లి ఎంపీపీ పాఠశాలలో ఇందుపల్లి స్కూల్‌ కాంప్లెక్స్‌ చైర్మన్‌ తిమ్మరాజు సీతారామ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.  మానికొండ గ్రంథాలయాధికారి కె.రమేష్‌బాబు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పెనమలూరు : భారత రాజ్యాంగం పట్ల ప్రజలం దరికీ అవగాహన ఉండాలని ఏపీ యూత్‌ సర్వీసెస్‌  డిపార్టుమెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.వి.ఎస్‌. సాయి బాబు అన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సంద ర్భంగా కానూరు సిద్ధార్థ న్యాయ కళాశాలలో శుక్రవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయిబాబు మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగమనేది ఒక దిక్సూచి లాంటిదన్నారు. కుల, మత, లింగ, ప్రాంత, భాష వివక్ష లేకుండా దేశ పౌరులందరికీ సమాన హక్కులు కల్పించిందన్నారు. ఈ సందర్భంగా  వక్తృత్వ పోటీలల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ చెన్నుపాటి దివాకర్‌బాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.

 ఉయ్యూరు  : భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకుని దళిత సంఘాల  ఆధ్వర్యంలో శుక్రవారం ఉయ్యూరు సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పలువురు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.  ఏఎంసీ మాజీ చైర్మన్‌ బి. చిట్టిబాబు, ఉయ్యూరు సీఐ ముక్తేశ్వరరావు, ట్రాఫిక్‌ ఎస్సై పేతురు, 3వ వార్డు కౌన్సిలర్‌ పద్మ, కాగిత కొండ, గెత్తం విజయ్‌కుమార్‌, సుధాకర్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొని  అంబేడ్కర్‌ చిత్ర పటంవద్ద నివాళులర్పించి దేశానికి ఆయన చేసిన సేవలు గుర్తుచేశారు. 


Advertisement
Advertisement