Advertisement
Advertisement
Abn logo
Advertisement

గండిపాళెం నుంచి 2,850 క్యూసెక్కుల నీరు విడుదల

ఉదయగిరి రూరల్‌, నవంబరు 28: మండలంలోని గండిపాళెం జలాశయం నుంచి 2, 4వ క్రష్ట్‌ గేట్ల ద్వారా ఆదివారం దిగువకు 2,850 క్యూసెక్కులు నీరు విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ డీఈ రవి తెలిపారు. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి  2,100 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 33.8 అడుగుల నీటిమట్టం ఉందని తెలిపారు. Advertisement
Advertisement