Abn logo
Jul 29 2021 @ 16:44PM

సినిమాను తలపిస్తోన్న హిజ్రాల మధ్య పోరు

అనంతపురం: హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ సినీ పక్కిలో జరుగుతోంది. రాయలసీమ గ్రూప్‌కు చెందిన ఓ హిజ్రాను బెంగళూరుకు చెందిన హిజ్రాల గ్రూప్ కిడ్నాప్ చేసింది. దీనికి ప్రతీకారంగా బెంగళూరు గ్రూప్‌కు చెందిన హిజ్రాను రాయలసీమ గ్రూప్ కిడ్నాప్ చేసింది. అయితే దీన్ని సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు గ్రూప్ అనంతపురానికి చేరుకుని రాయలసీమ గ్రూప్‌కు చెందిన ఓ హిజ్రాపై దాడి చేసింది. నగదు, నగలను దోచుకుంది. దీంతో రాయలసీమ గ్రూప్ హిజ్రాలు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టరేట్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో  అక్కడి నుంచి వెనుదిరిగారు.