పెన్నానదికి నాయకుల గంగపూజ

ABN , First Publish Date - 2021-10-25T05:38:42+05:30 IST

ఎగువున ఉన్న కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తోంది.

పెన్నానదికి నాయకుల గంగపూజ
పెన్నానదిలో గంగపూజ చేస్తున్న టీడీపీ నాయకులు

హిందూపురం, అక్టోబరు 24: ఎగువున ఉన్న కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో పెన్నానది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెన్నానది ఉదృతంగా ప్రవహిస్తూ జిల్లాలోకి ప్రవేశంతో సంతేబిందూనూరు వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు గంగపూజ నిర్వహించారు. రెండు దశాబ్దల తరువాత పెన్నాకు జలక కళ రావడం ఆనందదాయకమన్నారు. కర్ణాటకలో వరుణుడు కరుణతో కరువు సీమ అనంత జిల్లాలోకి పెన్నానదితో నీళ్లు రావడం సాగు, తాగు నీటి సమస్య తగ్గి రైతాంగానికి ఊరట లభిస్తోందన్నారు. నదిలో ప్రవాహించే నీటిని నది పరివాహన చెరువులను నింపే విదంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, నాయకులు కొల్లకుంట అంజినప్ప, డీఈ రమేష్‌, అమర్‌నాధ్‌, హెచఎం రాము, దుర్గానవీన, ఆదినారాయణ, డైమండ్‌బాబా, శివకుమార్‌, భాస్కర్‌, శ్రీరాములు, సురే్‌షనాయక్‌, జయసింహా, బేబి, నాగమణి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా మున్సిపల్‌ వైస్‌ చైర్మెన బలరామిరెడ్డితో పాటు వైసీపీ నాయకులు పెన్నానదిలో గంగపూజ చేశారు. పెన్నానది పరివాహక ప్రాంతం చౌళూరు, తూమకుంట, సంతేబిందనూరు. కిరెకెర ప్రాంతాల ప్రజలు నదిలో గంగపూజ చేశారు.


Updated Date - 2021-10-25T05:38:42+05:30 IST