స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాక్సీన్లు వేయించుకోండి: సీఎం గెహ్లాట్

ABN , First Publish Date - 2021-01-21T05:10:57+05:30 IST

ఆరోగ్య కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా వ్యాక్సీన్ వేయించుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అభ్యర్థించారు. కరోనా వైరస్ ...

స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాక్సీన్లు వేయించుకోండి: సీఎం గెహ్లాట్

జైపూర్: ఆరోగ్య కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కరోనా వ్యాక్సీన్ వేయించుకోవాలని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అభ్యర్థించారు. కరోనా వైరస్ వ్యాక్సినేషన్‌కు నామమాత్రపు స్పందన వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు కోరారు. శనివారం తొలిసారి వ్యాక్సినేషన్ మొదలు పెట్టగా ఆ రోజు పెట్టుకున్న టార్గెట్‌లో 73.8 శాతం వ్యాక్సినేషన్ జరిగింది. అయితే అది సోమవారం నాటికి 68.72 శాతానికి తగ్గిపోగా.. మంగళవారం ఏకంగా 54.89 శాతానికి పడిపోయింది. వ్యాక్సిన్ తయారీదారులు చేసిన విచక్షణారహిత ప్రకటనలే ఈ తగ్గుదలకు కారణమని ముఖ్యమంత్రి గెహ్లాట్ ఆరోపించారు. వాణిజ్య కారణాలతో వ్యాక్సినేషన్ తయారు చేస్తున్న రెండు కంపెనీలు విచక్షణారహిత ప్రకటనలు చేయడంతో.. ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సీన్ వేయించుకునేందుకు తక్కువగా వస్తున్నారని ఆయన అన్నారు. ‘‘ మంగళవారం వ్యాక్సిన్‌కి సంబంధించి భారత్ బయోటెక్ మార్గదర్శకాలను వెల్లడించింది. ఇదే మార్గదర్శకాలను ముందే విడుదల చేసి ఉంటే... వ్యాక్సిన్ పట్ల ప్రజలకు మరింత నమ్మకం పెరిగేది..’’ అని ఇవాళ సీఎం ట్వీట్ చేశారు. కాగా ఆరోగ్య కార్యకర్తలు తమంత తాముగా ముందుకొచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ ఆయన మరో ట్వీట్‌లో కోరారు. 

Updated Date - 2021-01-21T05:10:57+05:30 IST