Abn logo
May 23 2020 @ 07:16AM

దుకాణాల్లో ప‌రిశుభ్ర‌త త‌ప్ప‌నిస‌రి!

ల‌క్నో: దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్‌ను త‌రిమికొట్టే ప్ర‌య‌త్నాలు జరుగుతున్నాయి. తాజాగా లాక్‌డౌన్‌లో కొన్ని స‌డ‌లింపులు ఇవ్వ‌డంతో ప‌లు దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే దుకాణదారులందరూ మొదటి రెండు రోజుల్లో దుకాణాలను శుభ్రం చేయాలని యూపీలోని గ‌జియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే త‌ప్ప‌నిస‌రిగా సామాజిక దూరం పాటించేలా చూడాల‌ని దుకాణ‌దారుల‌కు కోరారు. ఈ నేప‌ధ్యంలో దుకాణ‌దారులు రెండు రోజుల పాటు వినియోగ‌దారుల‌ను దుకాణాల‌లోకి అనుమ‌తించ‌రు. అదేవిధంగా ఏ దుకాణం ఎప్పు‌డు తెర‌వాల‌నేది అధికారులు నిర్ణ‌యించి, సంబంధిత దుకాణ‌దారుల‌కు తెలియ‌జేశారు. దుకాణాల ప‌రిశుభ్ర‌త‌ను అధికారులు ప‌రిశీలించి‌న అనంత‌మే వాటిని నిర్వ‌హించేందుకు అనుమ‌తినిస్తారు. 

Advertisement
Advertisement
Advertisement