Abn logo
Jun 1 2020 @ 11:43AM

నాలుగంత‌స్తుల భ‌వ‌నంపై పిట్ట‌గోడ‌కు వేలాడిన యువ‌తి‌.... గట్టిగా అర‌వ‌డంతో...

వల్సాడ్‌: గుజరాత్‌లోని వల్సాడ్‌లో నాలుగు అంతస్తుల భవనంపై పిట్ట‌గోడ‌కు వేలాడుతున్న ఒక యువ‌తిని స్థానికులు ర‌క్షించారు. ఈ ఘటన జిల్లాలోని పర్నేరాలో చోటుచేసుకుంది. భ‌వ‌నంపైకప్పు మీదకు చేరుకున్న ఆ బాలిక ప‌ట్టుత‌ప్ప‌డంతో ఈ ఘటన చోటుచేసుకుంద‌ని తెలుస్తోంది. అయితే  ఆ యువ‌తి ఆత్మహత్యాయత్నం చేసింద‌ని కొంద‌రు అంటున్నారు. ఆ 17 ఏళ్ల యువ‌తి తానుంటున్న‌ అపార్ట్‌మెంట్ పైనున్న పిట్ట‌గోడ నుంచి వేలాడుతున్న విష‌యాన్ని స్థానికులు గ‌మ‌నించారు.  ఈ సమయంలో చాలా మంది వీడియోలు కూడా తీసి, సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇంత‌లో ఇద్ద‌రు స్థానికు‌లు ఆమెకు చేయి అందించి, పైకి తీసుకువ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వల్సాద్‌కు చెందిన పోలీసు అధికారి మాట్లాడుతూ ఆ యువ‌తి అపార్ట్‌మెంట్ పైక‌ప్పుకు చేరుకున్నాక కాలు ప‌ట్టుత‌ప్పి ప్ర‌మాదానికి గుర‌య్యింద‌న్నారు. వెంట‌నే ఆమె అర‌వ‌డంతో స్థానికులు ఆమెను కాపాడార‌న్నారు. అయితే పోలీసులు ఆమెను ఈ ఘ‌ట‌న గురించి అడ‌గ‌గా స‌రైన స‌మాధానం చెప్ప‌లేదు. ఆ యువ‌తి తండ్రి కోఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగం చేస్తున్నాడు. 


Advertisement
Advertisement