Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్కూల్‌లో ఉండగా టీనేజీ అమ్మాయికి తీవ్ర కడుపు నొప్పి.. సెలవు కావాలంటూ సర్ దగ్గరకు వెళ్తే.. అక్కడ అతడు చేసిన పనికి ఆమె షాక్

ఇంటర్నెట్ డెస్క్: ఆ అమ్మాయికి సుమారు 14ఏళ్ల వయసు ఉంటుంది. రోజూలాగే శనివారం రోజు కూడా ఆమె స్కూల్‌కు వెళ్లింది. క్లాసులో ఉండగా.. ఆమెకు కడుపు నొప్పి వచ్చింది. అయితే తొలుత దాన్ని ఆ అమ్మాయి లైట్ తీసుకుంది. తగ్గిపోతుందిలే అని భావించింది. అయితే.. నొప్పి తీవ్రం అయింది. ఈ క్రమంలోనే తన స్నేహితురాలిని వెంటపెట్టుకుని.. సెలవు కోసం ఉపాధ్యాయుడి దగ్గరకు బయల్దేరింది. అనంతరం ఆ ఉపాధ్యాయుడికి తన సమస్యను వివరించి.. సెలవు కావాలని కోరింది. ఈ క్రమంలో అతడు చేసిన పనికి ఆ అమ్మాయి షాకైంది. ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసింది. కాగా.. అక్కడ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని బిల్వారా జిల్లాకు చెందిన 14ఏళ్ల అమ్మాయి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. రోజూ లాగే శనివారం కూడా స్కూల్‌కు వెళ్లిన ఆమెకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో.. సెలవు కోసం స్నేహితురాలిని వెంట బెట్టుకుని హిందీ ఉపాధ్యాయుడైన నారాయణ దగ్గరకు వెళ్లింది. అనంతరం తన సమస్యను వివరించి.. లీవ్ కావాలంటూ అడిగింది. దీంతో స్పందించిన ఆ ఉపాధ్యాయుడు.. ఆ అమ్మాయి స్నేహితురాలిని బయటకు పంపించాడు. అనంతరం ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. తాను చెప్పినట్టు చేయకున్నా.. ఈ విషయాన్ని బయట చెప్పినా పరీక్షలో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించి.. ఆ అమ్మాయిని లైంగికంగా వేధించాడు.


ఉపాధ్యాయుడు చేసిన పనికి షాకైన ఆ అమ్మాయి.. విలపిస్తూ బయటకొచ్చేసింది. ఆ తర్వాత స్కూల్‌లో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో ఆగ్రహానికి లోనైన కుటుంబ సభ్యులు.. నారాయణకు దేహశుద్ధి చేసేందుకు బయల్దేరారు. దీంతో విషయం కాస్తా గ్రామస్థుల దృష్టికి వెళ్లడంతో.. పెద్ద ఎత్తున స్కూల్ వద్దకు చేరుకున్నారు. పాఠశాలకు తాళం వేసి.. ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. సదరు ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా.. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement