యువతి అవస్థలు! క్వారంటైన్ నుంచి పారిపోబోయి.. కిటికీలో ఇరుక్కుని..

ABN , First Publish Date - 2021-03-16T22:54:32+05:30 IST

క్వారంటైన్ సెంటర్‌ నుంచి పారిపోదామనుకున్న ఓ యువతి ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. కిటికీ నుంచి తప్పించుకుందామని ప్రయత్నిస్తూ ఇనుప చువ్వల మధ్యలో ఇరుక్కుపోయింది. ఎటూ కదలలేక అల్లాడిపోయింది.

యువతి అవస్థలు! క్వారంటైన్ నుంచి పారిపోబోయి.. కిటికీలో ఇరుక్కుని..

ముంబై: క్వారంటైన్ సెంటర్‌ నుంచి పారిపోదామనుకున్న ఓ యువతి ఊహించని విధంగా చిక్కుల్లో పడింది. కిటికీ నుంచి తప్పించుకుందామని ప్రయత్నిస్తూ ఇనుప చువ్వల మధ్యలో ఇరుక్కుపోయింది. ఎటూ కదలలేక అల్లాడిపోయింది. మహారాష్ట్రలోని పుణేలోగల ఎరండ్వానీ ప్రాంతంతో సోమవారం ఈ ఉదంతం జరిగింది. సోమవారం రాత్రి 11.30 గంటలకు ఆమె క్వారంటైన్ ప్రాంతం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిందని పోలీసులు తెలిపారు. రెండో అంస్థులో ఓ కిటికీ నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించి ఆమె ఇనుప చువ్వల మధ్యలో ఇరుక్కుపోయిందని అన్నారు.  అమె ఎటూ కదలలేకపోవడంతో చివరికి అగ్నిమాక సిబ్బంది సహాయంతో ఆమెను రక్షించాల్సి వచ్చిందని తెలిపారు. ఢిల్లీకి చెందిన సదరు యువతి కొంత కాలంగా అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంటోంది. అయితే..ఇటీవల కాలంలో ఆమెలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు ఆమెను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. గతంలో ఓ మారు ఇలాగే పారిపోయేందుకు ప్రయత్నించిన ఆమె సోమవారం నాడు రెండోసారి ప్రయత్నించి ఇబ్బందుల్లో పడింది. దీంతో..అగ్నిమాప సిబ్బంది కట్టర్ల ద్వారా చువ్వలను తొలగించి యువతిని రక్షించారు. 

Updated Date - 2021-03-16T22:54:32+05:30 IST