Abn logo
Sep 18 2021 @ 23:45PM

గీత సినిమా విజయవంతం కావాలి

క్లాప్‌ కొడుతున్న మంత్రి అప్పలరాజు

వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు గ్రామానికి చెందిన తిమ్మల కిరణ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న గీత సినిమా విజయవంతం కావాలని మంత్రి సీదిరి అప్పలరాజు ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం శ్రీమణికంఠ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమం స్థానిక కొత్తూరుపోలమ్మ ఆలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి క్లాప్‌ కొట్టారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ హేమంత్‌, వైసీపీ మండల అధ్యక్షుడు గురయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.