Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవంనర్సీపట్నం/ అర్బన్‌/నాతవరం /మాకవరపాలెం/ గొలుగొండ/ కృష్ణాదేవిపేట, నవంబరు 26 : భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నియోజకవర్గంలోని నాలుగు మండ లాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహిం చారు.  నర్సీపట్నంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో అబీద్‌ సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. వైస్‌చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి, అయ్య రక కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కర్రి కనకమహాలక్ష్మి, కౌన్సిలర్‌ సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వేములపూడి కేజీబీవీలో జరిగిన వేడుకల్లో ఆర్డీవో గోవిందరావు అంబేడ్కర్‌ విగ్రహా నికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.  తహసీల్దార్‌. కె.విజయ, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి కె.భవానీ, ఎస్‌డబ్ల్యూవో బాబూరావు, తదితరులు పాల్గొన్నారు. మాకవరపాలెం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటైన వేడుకల్లో ఎంపీడీవో అరుణశ్రీ, ఈవోపీ ఆర్‌డీ సీతామహాలక్ష్మి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నాతవరంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ కాపారపు అప్ప లనర్స, సెంట్రల్‌ బ్యాంకు డైరెక్టర్‌ అం కంరెడ్డి జమీలు, సర్పంచ్‌ గొలగాని రాణి, కార్యదర్శి జె.చినబాబు ఎంపీ టీసీ చెక్కా ప్రభవతి, కరక అప్పలరాజు పి.కె.గూడెం, జగ్గంపేట సర్పంచ్‌లు లగుడు నాగేశ్వరరావు, జీరెడ్డి సోమన్నదొర పాల్గొన్నారు.  గొలుగొండ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటైన కార్యక్రమం లో తహసీల్దార్‌  వెంకటేశ్వరరావు, సాం ఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రిన్సిపాల్‌ ప్రేమారావుతోపాటు వివిధ పాఠశాలల్లో ఆయా హెచ్‌ఎంలు, ఉపాఽ ద్యాయులు అంబేడ్కర్‌ చిత్రపటా లకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.  డీటీ ఆనంద్‌, వీఆర్‌వోలు పాల్గొన్నారు. అలాగే, ఏఎల్‌ పురంలో జరిగిన వేడు కల్లో గొలుగొండ ఎంపీపీ గజ్జలపు మణికుమారి, సర్పంచ్‌ సుజాత అంబేడ్కర్‌ విగ్రహం వద్ద అంజలి ఘటించారు.

Advertisement
Advertisement