ఘనంగా దసరా వేడుకలు

ABN , First Publish Date - 2021-10-17T05:52:54+05:30 IST

దసరా వేడుకలను మంథని ప్రాంతంలో ప్రజ లు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా దసరా వేడుకలు
పట్టు వస్ర్తాలను సమర్పిస్తున్న జడ్పీ చైర్మన్‌ పుట్టమధు

- ఊరూరా శమీ పూజలు 

- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు 

మంథని, అక్టోబరు 16 : దసరా వేడుకలను మంథని ప్రాంతంలో ప్రజ లు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. శ్రీ మహాక్ష్మి, శ్రీ లక్ష్మీనారాయణస్వామి ఆలయాల్లో భక్తులు దర్శించుకున్నారు. శ్రీ మహాలక్ష్మిని, శ్రీ లలితాంభిక, శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి, శ్రీలక్ష్మినారాయణస్వామి అమ్మ వార్లను అందంగా అలంకరించారు. రాత్రి శ్రీలక్ష్మీనారాయణ స్వామితో ఉ త్సవమూర్తులను ప్రత్యేక రథంపై ఊరేగించారు. భక్తులు స్వామికి మంగళహారతులిచ్చి దర్శించుకున్నారు. శ్రీలక్ష్మినారాయణస్వామి ఆలయం ప్రాం గణంలో ప్రతిష్టించిన శ్రీ దుర్గామాతను భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించారు. పట్టణంలోని పలుఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు కోర్టు సమీపంలోని జమ్మి చెట్టు ను దర్శించుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకున్నారు. అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా, మంథ ని ప్రాంత ప్రజలంతా క్షేమంగా ఉండాలని శ్రీలక్ష్మీనారాయణ స్వామి, అ మ్మవార్లను వేడుకున్నట్లు జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు వెల్లడించారు. దసరా పండగ సందర్భంగా ప్రతి ఏటా మాదిరగనే శ్రీలక్ష్మీనారాయణ స్వామికి జడ్పీచైర్మన్‌ పుట్ట మధు, మంథని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజలు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఇంటి నుంచి పట్టు వస్త్రాలను మేళాతా ళాలతో ఆలయానికి తీసుకువచ్చి శనివారం సమర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తగరం సు మలతశ్రీనివాస్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ శ్రీరాంభట్ల సంతోషిని, ఎంపీపీ కొండ శంకర్‌, వైఎస్‌చైర్మన్‌ కుమార్‌, ఆల య కమిటీ చైర్మన్లు వొల్లాల అశోక్‌, మారుపాక సరోజన, టీఆర్‌ఎస్‌ నేత లు బత్తుల సత్యనారాయణ, వీకే రవిలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:52:54+05:30 IST