మునిసిపల్‌ ఆదాయానికి గండి

ABN , First Publish Date - 2021-10-24T05:11:09+05:30 IST

వనపర్తి మునిసిపా లిటీ రోజురోజుకు వివాదాలకు వేదికగా అవుతున్నది.

మునిసిపల్‌ ఆదాయానికి గండి
వనపర్తి మునిసిపల్‌ కార్యాలయం

- పశువుల సంత వసూళ్లపై గందరగోళం

- మార్చిలో రూ. 3.19 లక్షలకు

    పశువుల సంత బహిరంగ వేలం

- టెండర్‌ దక్కించుకున్నది ఒకరు.. వసూళ్లు చేస్తున్నది మరొకరు

- నిబంధనలకు తిలోదకాలు పలుకుతున్న అధికారులు

- తాను చెల్లించిన డబ్బులు ఇవ్వాలని కార్యాలయం చుట్టూ టెండర్‌దారుడు ప్రదక్షిణలు  

వనపర్తి టౌన్‌, అక్టోబరు 23: వనపర్తి మునిసిపా లిటీ రోజురోజుకు వివాదాలకు వేదికగా అవుతున్నది. మునిసిపాలిటీ అధికారులు నిబంధనలకు తిలోద కాలు ఇస్తూ తమ ఇష్టానుసారం వ్యవహరించడమే ఇందుకు కారణమవుతున్నది. మునిసిపాలిటీకి ఆదా యం సమకూరే విషయాల్లోనూ పట్టీపట్టనట్లు వ్యవ హరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం మునిసిపాలిటీల్లో తైబజార్‌, పశువు ల సంత, జంతువధశాలను వేరువేరుగా నిబం ధనల ప్రకారం బహిరంగ వేలం నిర్వహిస్తారు.  వేలం నిర్వహించడం వల్ల వనపర్తి మునిసిపాలిటీకి ప్రతీ ఏడాది దాదాపు రూ. 30 లక్షలకు పైగానే ఆదా యం సమకూరుతుంది. అందులో భాగంగానే ఈ ఏ డాది కూడా మార్చిలో వేలం నిర్వహించారు. ఇందు లో పశువుల సంతను కూడా వేలం నిర్వహించగా ప ట్టణానికి చెందిన ఈరపోగు రవికుమార్‌ అనే వ్యక్తి రూ. 3.19 లక్షలకు టెండర్‌ దక్కించుకున్నాడు. తీరా సంతలో డబ్బులు వసూళ్లు చేయడానికి వెళ్లగా అసలు సమస్య మొదలైంది. 

ట్యాక్స్‌ వసూళ్లపై అభ్యంతరం...

వనపర్తి మునిసిపాలిటీ పరిధిలో ప్రతీ శనివారం పశువుల సంత జరుగుతుంది. ఈ సంతలో పశువుల ను కొన్న వారు, అమ్మిన వారు నూటికి రూ. 10 చొ ప్పున మునిసిపాలిటీకి డబ్బులు (ట్యాక్స్‌) చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసమే నిబంధనల ప్రకారం అధి కారులు బహిరంగ వేలం నిర్వహిస్తారు. ఇదే క్రమం లో మార్చిలో నిర్వహించిన వేలంలో టెండర్‌  దక్కిం చుకున్న ఈరపోగు రవికుమార్‌ ట్యాక్స్‌ వసూళ్ల కోసం సంత నిర్వహించే ప్రదేశానికి వెళ్లగా కొందరు వ్యక్తులు సంత తమదని, వసూళ్లు కూడా మేమే చే సుకుంటామని అడ్డు తగిలారు. దీంతో టెండర్‌ ద క్కించుకున్న వేలందారుడు మునిసిపల్‌ అధికారుల కు ఫిర్యాదు చేశాడు. నిబంధనల ప్రకారం ఎవరైతే టెండర్‌ దక్కించుకుంటారో వారికే ట్యాక్స్‌ వసూళ్లు చేసుకునే అనుమతి అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది.   కానీ, ముని సిపల్‌ అధికారులు అలా వ్యవహ రించకుండా టెండర్‌ దక్కించుకున్న వ్యక్తినే సంతలో ట్యాక్స్‌ వసూల్‌ చే యకుండా తిరిగి వాపస్‌ రావాలని ఆదేశించారు. ఒకవేళ టెండర్‌ను రద్దు చేసినట్లైతే తిరిగి కొత్తగా రీటెండర్‌ పిలవాలి. ఇలా అవేమీ ని ర్వహించకుండా టెండర్‌ దక్కించు కున్న వ్యక్తిని కాద ని ప్రస్తుతం జిల్లా గొర్రెల పెంపకదారుల సహ కార యూనియన్‌ ఆధ్వర్యంలో ట్యా క్స్‌ వసూళ్లు చేస్తున్నారు. ఇక అప్పటి నుంచి మునిసిపాలిటీకి సంత వసూ ల్‌ ద్వారా వచ్చే ఆదాయం కోల్పోవడమే కాకుండా వివాదం తలెత్తింది. 

సంతకు స్థలం లేదంటూ...

 ఏళ్లుగా పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర వారపు పశువుల సంత జరుగుతు ఉండేది. రోడ్డుపై సంత జరగడం వల్ల వాహనదారులకు, పా దాచారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని సంత ప్రదేశాన్ని పట్టణ శివారులోని పాలకేంద్రం దగ్గరికి మార్చారు. అక్కడ కూడా అభ్యంతరాలు రా వడంతో తిరిగి అక్కడి నుంచి ఏకో పార్కు ముందు నిర్వహిం చాలని అధికారులు సూచించారు. ఈ సంత లో ట్యాక్స్‌ వసూళ్లు చేయడానికి మార్చిలో ముని సిపల్‌ అధికారులు నిర్వహించిన బహిరంగ వేలంలో పా ల్గొన్న వ్యక్తి మొదటగా మునిసిపల్‌ కమిషనర్‌ వన పర్తి పేరుపై 017525 నెంబర్‌ గల రూ. 50 వేల డీడీని తీసి మునిసిపాలిటీలో ఇచ్చాడు. రూ. 3.19 ల క్షలకు టెండర్‌ దక్కించుకున్న వ్యక్తి మొదటి వి డత గా రూ. 56వేల 400 నగదు రూపంలో కార్యాల యానికి చెల్లించాడు. సంతలో ట్యాక్స్‌ వసూళ్లు చేసు కోవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో తాను చె ల్లిం చిన డబ్బులు తనకు తిరిగి వాపస్‌ ఇవ్వాలని, నో డ్యూవ్‌ సర్టిఫికేట్‌ కూడా ఇవ్వాలని టెండర్‌ దక్కించు కున్న రవికుమార్‌ కోరుతున్నాడు. ఈ వివాదంపై మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కూడా పలుమా ర్లు కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది.  కేవలం కొందరు వ్యక్తులకు మునిసిపాలిటీ ఆదాయా న్ని అప్పన్నంగా కట్టబెట్టడంపై పలు అనుమానాలు  రేకెత్తుతున్నాయి. 



Updated Date - 2021-10-24T05:11:09+05:30 IST