వైభవంగా గోదాదేవి, రంగనాథ స్వామి కల్యాణోత్సవం

ABN , First Publish Date - 2022-01-15T05:19:02+05:30 IST

పట్టణంలోని వైష్ణవ సంప్రదాయ ఆలయాలైన రంగనాథస్వామి ఆలయం,

వైభవంగా గోదాదేవి, రంగనాథ స్వామి కల్యాణోత్సవం
అహోబిల మఠం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో గోదాదేవి కల్యాణోత్సవానికి హాజరైన భక్తులు

గద్వాల టౌన్‌,  జనవరి 14 : పట్టణంలోని వైష్ణవ సంప్రదాయ ఆలయాలైన రంగనాథస్వామి ఆలయం, సంతాన వేణుగోపాల స్వామి ఆలయం, అహోబిల మఠం లక్ష్మీనారసింహాస్వామి ఆలయాల్లో గోదాదేవి, రంగనాథ స్వామి కల్యాణోత్సవనాన్ని శుక్రవారం అం గరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద అగ్రహారం లోని అహోబిళమఠం లక్ష్మీనరసింహ స్వామి ఆల యంలో గత నెల 16నుంచి ప్రారంభమైన ధనుర్మాస ప్రత్యేక పూజల అనంతరం చివరిరోజైన పుష్య బహు ల ద్వాదశి నాడు అమ్మవారి కల్యాణోత్సవాన్ని శ్రీవత్సవ, సామవేదం అరవింద్‌, బోరవెల్లి రమేష్‌, మునిమడుగు శ్రీనిధి అర్చక స్వాముల ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. కార్యక్రమంలో మఠం మేనేజర్‌ రమాకాంత్‌, కార్యదర్శి సామవేదం వేణుగోపాలాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రచారి బృందం ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. స్వామివారిని స్థానిక గుం టి చెన్నకేశవస్వామి ఆలయం వరకు పల్లకీ సేవ ని ర్వహించారు.  అదేవిధంగా భీంనగర్‌లోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసం ము గింపు సందర్భంగా ప్రత్యేక పూజలు,  గోదాదేవి, రం గనాథ స్వామి వార్ల కల్యాణోత్సవంను అర్చకులు రా ఘవేంద్రాచార్య, పవన్‌ ఆచార్యల ఆధ్వర్యంలో శాస్ర్తో క్తంగా నిర్వహించారు.  ఆలయ ధర్మకర్తలు విక్రమ సింహారెడ్డి, సుహాసిని రెడ్డి దంపతులు, సంయు క్తమ్మతో పాటు 15మంది జంటలు కల్యాణంలో పా ల్గొన్నారు. పట్టణంలోని బుదరపేద శ్రీరంగాథస్వామి వారి ఆలయంలో గోదాదేవి, రంగనాథ స్వామి కల్యా ణోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భం గా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, హో మం నిర్వహించగా భక్తులు  హాజరయ్యారు. 

 కోదండరామాలయంలో  ..

ఇటిక్యాల/ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామాలయంలో శుక్రవారం గోదా రంగనాఽథస్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుంచి కల్యాణోత్సవాన్ని తిలకించేం దుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ వేద పండితులు కల్యాణాన్ని జరిపించారు.  అలాగే ధనుర్మాస వ్రత మహోత్సవం కార్యక్రమంలో సుప్రభాతసేవ, తిరువారాదన, అధ్యాయనోత్సవ పరిసమాప్తి కార్యక్రమాలు నిర్వహించారు. నాగేశ్వరరెడ్డి, కొండమ్మల జ్ఞాపకార్థం వారి కుమార్తెలు అల్లుళ్లు గోదారంగనాథస్వామి కల్యాణాన్ని జరిపించి, అన్నదానం చేసినట్లు ఆలయ మేనేజరు సురేంద్రరాజు తెలిపారు.

Updated Date - 2022-01-15T05:19:02+05:30 IST