ఘనంగా అమ్మవార్ల నిమజ్జనం

ABN , First Publish Date - 2021-10-18T04:55:03+05:30 IST

గ్రామాలలో దేవీ నవరాత్రులు వైభవంగా జరి గాయి. తొమ్మిది రోజులు పూజలందుకున్న అమ్మవార్ల విగ్రహాలను ఆది వారం భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లి కాల్వల్లో నిమజ్జనం చేశారు.

ఘనంగా అమ్మవార్ల నిమజ్జనం
నిడదవోలులో అమ్మవారిని ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకువెళుతున్న భక్తులు

నిడదవోలు, అక్టోబరు 17 : గ్రామాలలో దేవీ నవరాత్రులు వైభవంగా జరి గాయి. తొమ్మిది రోజులు పూజలందుకున్న అమ్మవార్ల విగ్రహాలను ఆది వారం భక్తులు ఊరేగింపుగా తీసుకువెళ్లి కాల్వల్లో నిమజ్జనం చేశారు.  నిడదవోలు పట్టణంలోని పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేశారు. పూజలందుకున్న అమ్మవారి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై ఉంచి తీన్‌మార్‌ డప్పులతో ఊరేగింపుగా  తీసుకువెళ్లారు.

గణపవరం :దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా వరద రాజపురంలో వైభవంగా అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. బాణసంచా కాల్పులతో శక్తి వేషాలతో ఊరేగింపు నిర్వహించారు. 

తాడేపల్లిగూడెం రూరల్‌ :తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పర గూడెంలో వైభవంగా అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో అమ్మ వారి కమిటీ సభ్యులు స్వయంగా వేషాలు ధరించి ఊరేగింపులో పాల్గొన్నారు. ఎంపీటీసీ కట్టా రంగబాబు ఉత్సవాలను ప్రారంభించారు.

వాసవీ మాత వెండి రథోత్సవం 

తాడేపల్లిగూడెం పట్టణంలోని వాసవీమాత వెండి రఽథోత్సవాన్ని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు గ్రంధి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మండా బ్రహ్మాజి, కోశాధికారి ఎన్‌కే రవి, మండవల్లి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-18T04:55:03+05:30 IST