పాలు పడాలంటే... ఇవి తినాలి

ABN , First Publish Date - 2020-11-29T15:41:07+05:30 IST

ప్రసవం అయ్యేంత వరకు ఒక ఎత్తు... అయ్యాక మరో ఎత్తు. బిడ్డ చుట్టే తల్లి ఆలోచనలు. తల్లి ద్వారానే పోషకాలు బిడ్డను చేరాలి కనుక మంచి ఆహారం తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదే. తల్లికి చక్కగా పాలు పడి ...

పాలు పడాలంటే... ఇవి తినాలి

ప్రసవం అయ్యేంత వరకు ఒక ఎత్తు... అయ్యాక మరో ఎత్తు. బిడ్డ చుట్టే తల్లి ఆలోచనలు. తల్లి ద్వారానే పోషకాలు బిడ్డను చేరాలి కనుక మంచి ఆహారం తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదే. తల్లికి చక్కగా పాలు పడి, బిడ్డకు పోషకాలందాలంటే సమతులాహారాన్ని తీసుకోవాలి. బాలింతలు రోజుకు కనీసం రెండున్నర లీటర్ల నీళ్లు తాగాలి. చాలా మంది పథ్యం పేరుతో ఏమీ తిననివ్వరు. అది మంచి పద్ధతి కాదు. ఏదైనా వైద్యుని సలహాతో తినవచ్చు. పాలు, పెరుగు, గుడ్లు, కంది పప్పు, సోయాతో చేసిన మీల్‌ మేకర్‌, మటన్‌, చికెన్‌ వంటివి రోజువారీ ఆహారంలో ఉండేట్టు చూసుకోవాలి. అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు కూడా తినవచ్చు. అవిసె గింజలు కూడా చాలా మంచివి. నువ్వులు, వేరు శెనగ, రైస్‌ బ్రాన్‌, ఆవ నూనెలతో వండిన వంటలను తినడం అవసరం. స్వీట్లు, వేపుళ్లు, నిల్వ పచ్చళ్లు లాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది. ఆహారంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే బిడ్డ ఆరోగ్యంగా ఎదగడంతోపాటూ, బరువు కూడా చక్కగా పెరుగుతుంది.

Updated Date - 2020-11-29T15:41:07+05:30 IST