దూర ప్రాంత ప్రయాణికులకు బంపరాఫర్

ABN , First Publish Date - 2022-03-06T13:13:44+05:30 IST

దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ..

దూర ప్రాంత ప్రయాణికులకు బంపరాఫర్

  •  ఆర్టీసీ ప్రత్యేక సౌకర్యాలు


హైదరాబాద్‌ సిటీ : దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఆర్టీసీ సోమవారం నుంచి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకువస్తోంది. బస్సులకోసం ఎదురుచూసే సమయంలో ప్రయాణికులు సేద తీరేందుకు ఆహ్లాదకరమైన నిరీక్షణ హాలు, స్నాక్స్‌, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తునట్లు ఈడీ వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మియాపూర్‌ ఎక్స్‌ రోడ్‌, కేపీహెచ్‌బీ, ఎస్‌ఆర్‌నగర్‌, టెలిఫోన్‌ భవన్‌, కాచిగూడ సీఏసీ, ఎల్‌బీనగర్‌ (డిమార్ట్‌ ఎదురుగా), పల్లవి గార్డెన్స్‌- చింతలకుంట ప్రాంతాల్లో ని ఆర్టీసీ బోర్డింగ్‌ పాయింట్లలో సాయంత్రం 4నుంచి రాత్రి చివరి బస్సులు వెళ్లే వరకు ఈ సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.

Updated Date - 2022-03-06T13:13:44+05:30 IST