Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రం నాశనం అవుతోందని వైసీపీ వాళ్లు కూడా ఒప్పుకొంటున్నారు

చంద్రబాబుకు ఎవరో మందుపెట్టేశారన్నమాట?

చుట్టూఉన్నవాళ్లే కదా పెడతారు. సలహాలు చెప్పేవారు సరిగా చెప్పాలిగా! 


2019 ఎన్నికల్లో మీరంతా పేలవంగా వ్యవహరించారేం?

ప్రభుత్వం ఉండి కూడా బూత్‌ల దగ్గర కేడర్‌ నిలబడలేకపోయింది. అధికారంలో ఉండి కూడా ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. 


వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారా?

చంద్రబాబు అవకాశం ఇస్తే పోటీ చేస్తాను. ఏడోసారి కూడా పోటీ చేసి రాష్ట్ర అభివృద్ధి కోసం నా అనుభవాన్ని వినియోగించాలన్నది నా భావన. ఇక, 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. మళ్లీ చంద్రబాబు సీఎం కావడం కోసం ఎంత చేయాలో అంత చేస్తాను. అలాగే, వందిమాగధులు కాకుండా పార్టీ కోసం కమిటెడ్‌గా పనిచేసే వాళ్లను తీసుకోవాలి. 


ఏపీలో ఎవరికీ రాష్ట్ర ఉమ్మడి ప్రయోజనాలు పట్టవు కదా?

అవును. బయటికి చెప్పకపోయినా వైసీపీ అభిమానులు కూడా రాష్ట్రం నాశనం అవుతుందని ఒప్పుకొంటున్నారు. చంద్రబాబు మళ్లీ గెలిస్తే తెలంగాణకు ఎవరూ రారని భావించి... జగన్‌, కేసీఆర్‌ ఇద్దరూ కూడబలుక్కుని ఆయన్ని ఓడించారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజున రజకులు, క్షురక వృత్తిలో ఉన్న వారూ ఆంధ్రాలోని ఊర్లలో లేరు. హైదరాబాద్‌ వచ్చేశారు.

Advertisement

రాజకీయ నేతలుమరిన్ని...

Advertisement