కరోనా మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం

ABN , First Publish Date - 2021-06-20T05:00:12+05:30 IST

కరోనాతో మృతి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం 5లక్షలు సహాయం చేస్తుందని పారా లీగల్‌ దశరథరామిరెడ్డి తెలిపారు.

కరోనా మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం

పెనగలూరు, జూన్‌19 : కరోనాతో మృతి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలకు చెందిన వారికి  కేంద్ర ప్రభుత్వం 5లక్షలు సహాయం చేస్తుందని పారా లీగల్‌ దశరథరామిరెడ్డి తెలిపారు. ఆసుపత్రులలో మృతి చెం దిన వారు స్థానిక మున్సిపల్‌, కార్పొరేషన్‌ కార్యాలయాల నుంచి మరణధృవీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. హోం క్వారంటైన్‌ ఉండి చనిపోయిన వారుంటే స్థానిక ప్రభుత్వ డాక్టర్‌ నుంచి పాజిటివ్‌ రిపోర్టుతో గ్రామ సచివాలయాల ద్వారా తీసుకోవాలని సూచించారు.  సర్టిఫికెట్‌తో పాటు మరణించిన వ్యక్తి రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు, లబ్ధిదారుల ఆధార్‌కార్డు, బ్యాంకు ఖా తాతో ఆన్‌లైన్‌లో 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

Updated Date - 2021-06-20T05:00:12+05:30 IST