సచివాలయ ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం

ABN , First Publish Date - 2021-10-25T04:40:28+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మొదట సచివాలయ ఉద్యోగులకు సంక్షేమ పథకాల్లో కోత విధించి అన్యాయం చేసిందని, ఇప్పడు ఏకంగా బయోమెట్రిక్‌ పేరుతో వారి జీతాల్లోనే కోత విధించడం దుర్మార్గమని అ న్నారు.

సచివాలయ ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
ఎమ్మెల్యే రవికుమార్‌

బయోమెట్రిక్‌ హాజరు లేదని జీతాల్లో కోత విధించడం దుర్మార్గం  

ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌


అద్దంకిటౌన్‌ అక్టోబరు 24: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం మొదట సచివాలయ ఉద్యోగులకు సంక్షేమ పథకాల్లో కోత విధించి అన్యాయం చేసిందని, ఇప్పడు ఏకంగా బయోమెట్రిక్‌ పేరుతో వారి జీతాల్లోనే కోత విధించడం దుర్మార్గమని అ న్నారు.  బయోమెట్రిక్‌ హాజరు లేదని ఉద్యోగులకు అక్టోబ రు నెలలో 10 శాతం, మరికొందరికి 50 శాతం జీతాల్లో కో త విధించడం అన్యాయమైన చర్య అని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించకుండా ఉద్యోగుల జీతా ల్లో కోత విధించడం ఏ మిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెట్రిక్‌తో సంబంధం లే కుండా పూర్వపు పద్ధతిలోనే గ్రామ, సచివాల య ఉద్యోగులకు జీతా లు చెల్లించాలని, ప్రొబేషన్‌ పక్రియను పూర్తి చే సి రెగ్యులర్‌ స్కేల్‌ ఇవ్వా లని ఆయన డిమాండ్‌ చేశారు. అలాగే అధికారంలోకి వచ్చిన నెల రోజులలో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఆ హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. అ లాగే ఉద్యోగుల డీఏ, పీఆర్‌సీ ప్రస్తావనే లేదని, వారి పెం డింగ్‌ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అ య్యిందని విమర్శించారు. అలాగే రెండున్నర లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని, కానీ ప్రభుత్వం డీఏస్సీ ఊసే ఎత్తడం లేదన్నారు. పోలీ్‌సశాఖలో అనేక ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 450 పో స్టులు ఉన్నట్లు చూపి నామమాత్రంగా భర్తీ చేస్తూ చేతు లు దులుపుకుంటున్నదని విమర్శించారు. పంచాయతీ రా జ్‌, ఇంజనీరింగ్‌, రెవెన్యూ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల లెక్కలకు ప్రభుత్వం ప్రకటిస్తున్న  వాటికి అసలు పొంతనే లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ ఇసుక విధానంతో ఎంతో మంది ఉపాధి కోల్పోయారని, వీరితో పాటు గోపాల మిత్రలు, గ్రీన్‌ అంబాసిడర్లను రోడ్డున పడేసిందని  ఎత్తిచూపారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక గ్రానైట్‌ క్వారీలు, పాలిషింగ్‌ యూనిట్లు మూతపడ్డాయని, దీంతో వేలాది మంది ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  అమలు కా ని హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే విమర్శించారు.


Updated Date - 2021-10-25T04:40:28+05:30 IST