ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు

ABN , First Publish Date - 2020-09-21T06:14:56+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని బద్దం

ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి


భగత్‌నగర్‌, సెప్టెంబరు 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా సమస్యలు పట్టవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్‌ సమా వేశం మర్రి వెంకటస్వామి అధ్యక్ష తన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం సీపీఐ శ్రేణులు ప్రజాపోరాటాలకు సిద్ధం కావా లని పిలునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తు ప్రైవేట్‌, కార్పొరేట్‌ శక్తులకు ప్రభుత్వ ఆస్తులను కట్టబెడుతోంద న్నారు. విద్యుత్‌ సవరణల చట్టం సవరణ వల్ల వినియోగ దారులపై భారం పడుతోందన్నారు. వ్యవసాయ బిల్లు, నిత్యావసర వస్తువుల పంపిణీని కూడా ప్రజలకు దూరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందన్నారు. కొవిడ్‌ సమయంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, కార్మికు లను ప్రభుత్వాలు ఆదుకోవడంలో విఫలమయ్యాయన్నారు.


రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్నుల వాటాను కేంద్రం ఇవ్వక పోవడం దారుణమ న్నారు. సీపీఐ శ్రేణులు దశలవారీగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపుని చ్చారు. సమావేశంలో రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యుడు కలవేని శంకర్‌, జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి, కూన శోభారాణి, కొయ్యడ సృజన్‌కుమార్‌, బోయిని అశోక్‌, అందెస్వామి, న్యాలపట్ల రాజు, బత్తుల బాబు, జెవి రమణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T06:14:56+05:30 IST