నియంత్రిత వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి

ABN , First Publish Date - 2020-05-27T10:33:49+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయంపై దృష్టి సారించిందని రాష్ట్ర అటవీ, దేవా దాయశాఖ మంత్రి

నియంత్రిత వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి

రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి


రామకృష్ణాపూర్‌, మే 26: రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత వ్యవసాయంపై దృష్టి సారించిందని రాష్ట్ర అటవీ, దేవా దాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలోని ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌లో జిల్లా స్థాయి వ్యవసాయ నియంత్రిత సాగు పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతాంగాన్ని ఆదుకునేందుకే ప్రణాళికాబద్దమైన వ్యవసాయం చేపట్టాలని సూచించార న్నారు. రైతుకు గిట్టుబాటు ధర వచ్చే పంటలు వేయడం ద్వారా ఆర్ధిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. రెండు పంటలు వచ్చే విధంగా భూమి సారవంతం కావడమే కాక పంటలు అధిక దిగుబడి వస్తుందన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రైతాంగ సమస్యలపై దృష్టి సారించారని, రైతుబంధు పొందే రైతులందరు నియంత్రిత వ్యవసాయం కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో వానాకాల ప్రణాళికలో భాగంగా లక్షా 61వేల ఎకరాల్లో వరి, కందులు 7,500  ఎకరాలు, పత్తి లక్షా 85వేల ఎకరాలు, ఇతర పంటలతో మొత్తం 3లక్షల 54 వేల ఎకరాలలో సాగు జరుగుతుందని తెలిపారు. చెన్నూర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మాట్లా డుతూ ముఖ్యమంత్రికి రైతులపై ఉన్న ప్రేమతో అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని, రైతుల కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి సాగులో కొత్త విధానాన్ని తీసుకువచ్చారన్నారు 


అదే విధంగా జిల్లాలో వేమనపల్లి మండలం మినహా జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూల వాతావరణం ఉందని, రైతులకు పం ట నష్టం అనే ఆలోచన ఉండదని, 5 సంవత్సరాలలో ఆ యిల్‌ పామ్‌ సాగు చేసిన రైతులకు ప్రత్యేక రాయితీలను అందించనుందన్నారు. ఎంపీ వెంకటేష్‌ నేత  మాట్లాడుతూ రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రిగా కేసీ ఆర్‌ చిరస్థాయిలో నిలుస్తారన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీ, ఎమ్మె ల్సీ పురాణం సతీష్‌, మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపల్లె దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యలు మాట్లాడుతూ రైతులకు మంచి రోజులు రానున్నాయని, నియంత్రిత వ్యవసాయంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్‌ భారతీ హోలీ కేరీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు నియంత్రిత వ్యవసాయంపై దృష్టి సారించాలని, రైతు లకు ఇబ్బందులు తలెత్తకుండ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధి కారులు, రైతు సమన్వయ కర్తలు, మంచిర్యాల, చెన్నూర్‌, నస్పూర్‌, క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తదితరులు పాల్గొన్నారు.


ప్లైఓవర్‌ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి

క్యాతన్‌పల్లి రైల్వే ప్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం  బ్రిడ్జి పనులను చెన్నూర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌తో కలిసి పరిశీలించిన అనంతరం ఆర్‌అండ్‌బి అధికారులతో మాట్లాడారు. పనులు వేగవంతం చేయాలని, బ్రిడ్జి పూర్తి చేసి రాకపోకలు జరిగే లా కాంట్రాక్టరు పనులను నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విప్‌ సుమన్‌ నమూనాను మంత్రికి వివరించారు. మంత్రి వెంట క్యాతన్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జంగం కళ, వైస్‌ చైర్‌పర్సన్‌ సాగర్‌ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు, ఆర్‌అండ్‌బీ అధికారులు.  ఉన్నారు.

Updated Date - 2020-05-27T10:33:49+05:30 IST