గరుత్మంతుడిపై గోవిందుడి కటాక్షం

ABN , First Publish Date - 2020-09-24T10:54:49+05:30 IST

తిరుమల వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి తన ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై కటాక్షమిచ్చారు

గరుత్మంతుడిపై గోవిందుడి కటాక్షం

మోహినీ అవతారంలో మురిపించిన జగన్మోహనుడు


తిరుమల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):  తిరుమల వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి తన ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై కటాక్షమిచ్చారు. విశేష భక్తజనం మధ్య జరగాల్సిన ఈ ఉత్సవం కరోనా ప్రభావంతో ఈ ఏడాది ఆలయానికే పరిమితమైంది.రంగనాయక మండపంలో మలయప్ప స్వామిని విశేష అలంకరణతో ఊరేగింపుగా తీసుకెళ్లి కల్యాణోత్సవ మండపంలో అప్పటికే సిద్ధం చేసిన గరుత్మంతుడిపై కొలువుదీర్చారు.


అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు సమర్పించిన సీఎం జగన్‌ వాహనంపై ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేదపారాయణం, దివ్యప్రబంధం నిర్వహించి మంగళవాయిద్యాలతో శాత్తుమొర, హారతి నైవేద్యాలు సమర్పించారు.కాగా ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో మలయప్పస్వామి మోహినీ రూపంలో శృంగార రసాధి దేవతగా సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు. 

Updated Date - 2020-09-24T10:54:49+05:30 IST