దేశంలో పూర్తి లాక్‌డౌన్ విధించం:కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడి

ABN , First Publish Date - 2021-04-14T16:06:17+05:30 IST

భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి కోసం పెద్ద ఎత్తున లాక్ డౌన్ విధించమని...

దేశంలో పూర్తి లాక్‌డౌన్ విధించం:కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ వెల్లడి

స్థానికంగా నియంత్రిస్తాం...


న్యూఢిల్లీ : భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసుల కట్టడి కోసం పెద్ద ఎత్తున లాక్ డౌన్ విధించమని, స్థానిక నియంత్రణ చేపడతామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ డేవిడ్ మాల్ పాస్ తో జరిగిన వర్చవల్ సమావేశంలో భారతదేశానికి రుణం పెంచడానికి ప్రపంచబ్యాంకు చేపట్టిన చర్యలను కేంద్రమంత్రి సీతారామన్ ప్రశంసించారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకాలు, కరోనా మార్గదర్శకాల అమలులాంటి ఐదు స్తంభాల వ్యూహంతో కరోనాను కట్టడి చేస్తామని సీతారామన్ స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించకుండా, స్థానికంగా కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ ఉండదని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కరోనా రోగులను ఇళ్లలో క్వారంటైన్ చేస్తామని చెప్పారు. 

Updated Date - 2021-04-14T16:06:17+05:30 IST