ముమ్మరంగా పారిశుధ్య పనులు

ABN , First Publish Date - 2020-06-04T09:53:50+05:30 IST

పట్టణ ప్రగతిలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను పురస్కరించుకొని నగరంలోని 60 డివిజన్లలో పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు

ముమ్మరంగా పారిశుధ్య పనులు

పలు డివిజన్లలో మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి పర్యటన 


కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 3: పట్టణ ప్రగతిలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాలను పురస్కరించుకొని నగరంలోని 60 డివిజన్లలో పారిశుధ్య పనులను ముమ్మరం చేశారు. ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు బుధవారం మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరు క్రాంతి పలు డివిజన్‌లలో పర్యటించారు. 6వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కోల సంపత్‌తో కలిసి డ్రెయినేజీలలో పూడికతీత పనులను పరిశీలించారు. అనంతరం దోమల నివారణకు ఫాగింగ్‌చేశారు. 46వ డివిజన్‌లో వంగల శ్రీదేవి పవన్‌ మూతవేసి ఉన్న డ్రెయినేజీలు, క్రాస్‌ కల్వర్టుల వద్ద చేతి ఫాగింగ్‌యంత్రంలో దోమల నివారణ చర్యలుచేపట్టారు. 28, 29 డివిజన్‌పరిధిలో మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు నాంపెల్లి శ్రీనివాస్‌, గుగ్గిళ్లపు మంజులరమేశ్‌తో కలిసి స్ర్టాం వాటర్‌ డ్రెయిన్‌ను పరిశీలించారు.


టవర్‌సర్కిల్‌ ఏరియాలో నీటితో నిలిచిన డ్రెయినేజీలను పరిశీలించారు. 60వ డివిజన్‌లో కార్పొరేటర్‌ వాల రమణారావు శానిటరీ సిబ్బందితో కలిసి పలుచోట్ల హ్యాండ్‌ ఫాగింగ్‌ మిషన్‌తో రసాయనాలను స్ర్పే చేశారు. 36వ డివిజన్‌లో 3వ రోజు కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ, ఏఈ గట్టుస్వామి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. 9వ డివిజన్‌లో కార్పొరేటర్‌ ఐలేందర్‌ యాదవ్‌ మురికి కాలువలలో చెత్తను తొలగించారు. దాదాపు అన్ని డివిజన్లలో కార్పొరేటర్లు, డివిజన్‌ కమిటీ సభ్యులు, ప్రత్యేకాధికారులు, ప్రజలతో కలిసి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో రోడ్లు, డ్రెయినేజీలు శుభ్రం చేశారు.

Updated Date - 2020-06-04T09:53:50+05:30 IST