హరితహారంలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2021-06-18T05:00:04+05:30 IST

మహిళా సంఘాల సభ్యులు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు పిలుపునిచ్చారు.

హరితహారంలో భాగస్వాములు కావాలి
జడ్చర్లలో మొక్కలు నాటే కార్యక్రమంపై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకట్రావు

- మహిళా సంఘాల సభ్యులను కోరిన కలెక్టర్‌



మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), జూన్‌ 17 : మహిళా సంఘాల సభ్యులు హరితహారం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు పిలుపునిచ్చారు. గురువారం కార్యాలయం నుంచి ఏపీఎంలు, సీసీలు, గ్రామ సమాఖ్యలు, స్వయం సహాయక మహిళా సంఘాలతో ని ర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళా సం ఘాలు తప్పనిసరిగా భాగస్వాములై ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, అన్ని కార్యాలయాలు,రహదారులకు ఇరువైపులా, ప్రైయివేట్‌ భూములు, ఇండ్లు, పొలం గట్లు, చెరువు కట్టలపై, హరితహారం మొక్కలను నాటి జిల్లాను అగ్రస్థానంలో నిపాలన్నారు. వర్షాకాలంలో అంటువ్యాధుల బారిన పడ కుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను జాగృతం చేయాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు డీఆర్‌డీవో యాదయ్య, ఏపీడీలు నాగమల్లిక, శారద, డీఐవో సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

 

మోడ్రన్‌ మార్కెట్‌కు స్థల పరిశీలన


భూత్పూర్‌ : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ముని సిపాలిటీల్లో వెజ్‌, నాన్‌ వెజ్‌ మోడ్రన్‌ మార్కెట్లను ఏర్పాటు చేయనున్న ట్లుగా కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. గురువారం భూత్పూర్‌ మునిసిపాలిటీ పరిఽధిలో మోడ్రన్‌ మార్కెట్‌ ఏర్పాటు నిమిత్తం స్థల పరిశీలించారు. భూత్పూర్‌ నుంచి నాగర్‌కర్నూల్‌ వెళ్లే రహదారి పక్కన ఉన్న స్థలాన్ని కలెక్టర్‌ పరిశీలించి, పూర్తి వివరాలు పంపాలని ఆదేశించారు. మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, కమిషనర్‌ నురూల్‌ నజీబ్‌, తహసీల్దార్‌ చెన్నకిష్టన్న, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


విస్తృతంగా మొక్కలు నాటాలి 


జడ్చర్ల : జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు విస్తృతంగా నాటాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు. జడ్చర్ల న్యూబస్టాండు ప్రాంగణం, క్రాస్‌రోడ్డులలో మొక్కలు నాటే కార్యక్రమంపై గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్చర్ల నుంచి నక్కలబండ తండా వరకు మూడు వరుసల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి, మునిసిపల్‌ కమిషనర్‌ సునీత, ఏఈ సాయికిరణ్‌, కౌన్సిలర్లు చైతన్యచౌహాన్‌, శశికిరణ్‌, నాయకులు దోరేపల్లి రవీందర్‌ తదితరులు ఉన్నారు. 


నూతన కలెక్టరేట్‌ పనుల పరిశీలన


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌), జూన్‌ 17 : నూతన కలెక్టర్‌ కార్యాల య సుందరీకరణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆ యన నూతన కలెక్టర్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయ ఆవ రణ ముందు జరుగుతున్న అంతర్గత రహదారి పనులను పరిశీలిం చారు. ఆవరణలో ఎక్కడ కూడా నీరు నిల్వ కుండా ఎప్పటికప్పుడు పోయేవిధంగా మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కార్యాలయం వద్ద బస్‌ షెల్టర్‌ నిర్మించాలని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌, జిల్లా అటవీశాఖ అధికారి గంగిరెడ్డి, ఆర్‌ అండ్‌బీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ స్వామి, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌,  ఉన్నారు.

Updated Date - 2021-06-18T05:00:04+05:30 IST