Abn logo
Jun 3 2021 @ 18:17PM

Viral: పెళ్లిలో వ‌ధువు కాళ్లు పట్టుకున్న వ‌రుడు!

పెళ్లి ఓ మహిళ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది. కట్టుకున్న భర్త కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేస్తుంది. పుట్టిన ఊరును, కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలి భర్త ఇంటికి వస్తుంది. భర్తకు నచ్చినట్టు మెలుగుతూ అతని వంశాభివృద్ధికి దోహదపడుతుంది. అయినా ఈ త్యాగాలను చాలా మంది గుర్తించరు. భార్యను బానిసలా భావిస్తారు. పెళ్లి వేడుక నుంచే ఈ బానిసత్వం మొదలవుతుంది. పెళ్లిలోనే వ‌ధువు చేత వ‌రుడి కాళ్ల‌కు పలుసార్లు దండాలు పెట్టిస్తారు. 


తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుక‌లో మాత్రం వ‌రుడే వ‌ధువు కాళ్ల‌కు మొక్కాడు. పెళ్లి తంతు పూర్త‌య్యి దండ‌లు మార్చుకుంటున్న స‌మ‌యంలో వరుడు అక‌స్మాత్తుగా వధువు కాళ్ల‌పై ప‌డ్డాడు. దీంతో ఆ పెళ్లికి హాజరైన బంధుమిత్రులంతా ఆశ్చర్యపోయారు. తను అలా చేయడానికి గల కారణాన్ని అతడు అక్కడున్న వారందరికీ వివరించాడట. క‌న్న‌వాళ్ల‌ను, తోబుట్టువుల‌ను వ‌దిలి నాకోసం, నా సంతోషం కోసం మా ఇంట్లో అడుగుపెట్ట‌బోతున్న ఆమె కాళ్ల‌కు దండం పెట్ట‌డంలో త‌ప్పేముంద‌ని ప్రశ్నించాడట.  త‌న వంశాన్ని అభివృద్ధి చేయ‌డానికి వ‌స్తున్న‌ది కాబ‌ట్టి ఆమె కాళ్ల‌కు దండం పెట్ట‌డం త‌న బాధ్య‌త అన్నాడట. అజిత్ వర్వాంధ్‌కర్ అనే వ్యక్తి ఈ విషయాన్ని, ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. వరుడు చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

ప్రత్యేకంమరిన్ని...