వివాహం క్యాన్సిల్ చేసిన వరుడు.. కారణం తెలిసి వధువు షాక్!

ABN , First Publish Date - 2020-02-09T02:33:54+05:30 IST

పెళ్లి కూతురి చీర బాలేదని వరుడి సంచలన నిర్ణయం

వివాహం క్యాన్సిల్ చేసిన వరుడు.. కారణం తెలిసి వధువు షాక్!

బెంగళూరు: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి పీటల వరకూ వచ్చిన బంధాన్ని తెంపేసుకున్నాడో యువకుడు. పెళ్లి నాటికి ఊరొదిలి పారిపోయాడు. అతను వెళ్లిపోవడానికి కారణం తెలిసి ఖంగుతిన్న వధువు పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకుడు పారిపోయిన కారణం తెలిసిన పోలీసులు కూడా షాకయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు చెందిన బీఎన్ రఘుకుమార్(29) అనే వ్యక్తి సంగీత అనే అమ్మాయిని ప్రేమించాడు. రెండు కుటుంబాలూ అంగీకరించడంతో వీరి ప్రేమ పెళ్లి వరకూ వచ్చింది. అయితే పెళ్లికి ముందు జరిగే కొన్ని కార్యక్రమాల్లో సంగీత ధరించిన చీరల నాణ్యత రఘు తల్లిదండ్రులకు నచ్చలేదు. కనీసం మంచి చీర కూడా కట్టుకోవా? అంటూ ఆమెను తిట్టారు. ఆమెతో పెళ్లి వద్దంటూ రఘుపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వారి ఒత్తిడికి తలొగ్గిన రఘు.. సరిగ్గా పెళ్లి నాటికి ఊరు విడిచి పారిపోయాడు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. రఘు కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

Updated Date - 2020-02-09T02:33:54+05:30 IST