Abn logo
Nov 25 2021 @ 16:49PM

వధువు ముందు ఈ వరుడు ఇలా వంగిపోయాడేంటని ఆశ్చర్యపోతున్నారా.. అసలు అక్కడ ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: నూతన వధూవరులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, అతిథులు అందరూ చూస్తుండగా పెళ్లి కొడుకు చేసిన ఓ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ వరుడు ఏం చేశాడు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


పెళ్లిలో అంగూఆర్బాటాలు సహజం. ఈ క్రమంలోనే ఓ పెళ్లి కూతురు.. లేత గులాబీ రంగులోని లెహంగా వేసుకుని ఓ పెళ్లి కూతురు అందంగా ముస్తాబైంది. అనంతరం తన భాగస్వామితో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు చేరుకుంది. అయితే స్టేజీ ఎక్కే క్రమంలో ఆ నవ వధువు.. తడబడింది. వేసుకున్న డ్రెస్ కారణంగా స్టేజీ ఎక్కేందుకు ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలో ఆ వరుడు.. తన భాగస్వామి సమస్యను గమనించాడు. దీంతో వెంటనే ఆమెకు సహాయం చేయడం ద్వారా స్టేజిపైకి చేరుకునేట్లు చేశాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు వరుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పెళ్లి కూతురిని అదృష్టవంతురాలిగా అభివర్ణిస్తూ కామెంట్లు చేస్తున్నారు. 




ప్రత్యేకంమరిన్ని...