Advertisement
Advertisement
Abn logo
Advertisement

కుర్తా ఖరీదు రూ.2.5 లక్షలు.. నెటిజన్ల ట్రోలింగ్!

ఓ సాధారణ కాటన్ కుర్తా ఖరీదెంత ఉంటుంది? ఓ 500 రూపాయలుంటుంది. మహా అయితే రెండు, మూడు వేల వరకు ఉండొచ్చు. ప్రపంచ ప్రఖ్యాత గుస్సి బ్రాండ్‌కు చెందిన ఓ కుర్తా ఖరీదెంతో తెలిస్తే ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతారు. భారతీయ మహిళల కోసం అంటూ గుస్సీ తన కలెక్షన్‌లో తాజాగా ఒక కుర్తా పెట్టింది.  దాని ఖరీదును ఏకంగా 3,500 డాలర్లుగా పేర్కొంది. అంటే మన కరెన్సీలో సుమారు 2,50,000 రూపాయలు. 


ఈ రేటు చూసి నెటిజన్లు షాకయ్యారు. ట్విటర్ వేదికగా ట్రోలింగ్ ప్రారంభించారు. `ఈ కుర్తా ఖరీదు 2.5 లక్షలా.. మా అమ్మ 250 రూపాయలకు కొంటుంది`,  `నాకు రూ.500 ఇస్తే.. ఇలాంటివి రెండు ఇస్తాను`, `బ్రాండ్ పేరు చెప్పి దీనిని రూ.2.5 లక్షలకు అమ్ముతారా?`, `పచ్చి మోసం` అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.   


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement