Abn logo
Mar 9 2021 @ 11:56AM

సర్జరీతో మగువలుగా మారనున్న 20 మంది మగవారు!

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఇటీవలికాలంలో లింగమార్పిడి ఆపరేషన్లు విరివిగా జరుగుతున్నాయి. స్త్రీ, పురుష మనస్తత్వాలు కలిగిన 20 మంది పురుషులు త్వరలో స్త్రీలుగా మారబోతున్నారు. వీరంతా సర్జరీలకు సంబంధించిన వివిధ స్టేజిలలో ఉన్నారు. జండర్ ఛేంజ్ చేయించుకుంటున్న వీరంతా ధైర్యంగా తమ పరిస్థితిని వారుంటున్న ప్రాంతంలోని వారికి చెబుతున్నారు. 

దీంతో వీరు సర్జరీ చేయించుకునేందుకు గ్రామస్తులు కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ హర్ష్ అమీన్ మాట్లాడుతూ గత రెండేళ్లలో అహ్మదాబాబాలో వెయ్యికిపైగా సర్జరీలు జరిగాయన్నారు. తాను 80కి పైగా సర్జరీలు చేశానని, ఈ విధంగా సర్జరీ చేయించుకుంటామని తన దగ్గరకు ప్రతీరోజూ 50 నుంచి 60 మంది వరకూ వస్తుంటారని తెలిపారు. ఇటువంటి సర్జరీకి కార్పొరేట్ ఆసుపత్రులలో సుమారు రూ. 8 లక్షల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. కొంతమంది విదేశాలకు వెళ్లి ఇటువంటి సర్జరీలు చేయించుకుంటారని అన్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement