పొన్నూరు మనుమరాలు... యూఎస్‌ నేవీ పైలట్‌

ABN , First Publish Date - 2020-05-23T16:57:37+05:30 IST

ప్రపంచంలోనే అత్యున్నత యుద్ధ విభాగాల్లో ఒకటైన యూఎస్‌ నేవీ పైలెట్‌ అధికారిణిగా తెలుగమ్మాయి దొంతినేని దేవిశ్రీ బాధ్యతలు స్వీకరించారు. పొన్నూరు సమీపంలోని కాకుమాను మండలం, పోతివానిపాలెం గ్రామానికి చెందిన ఆమె తాత దొంతినేని

పొన్నూరు మనుమరాలు... యూఎస్‌ నేవీ పైలట్‌

పొన్నూరు టౌన్‌ (గుంటూరు జిల్లా): ప్రపంచంలోనే అత్యున్నత యుద్ధ విభాగాల్లో ఒకటైన యూఎస్‌ నేవీ పైలెట్‌ అధికారిణిగా తెలుగమ్మాయి దొంతినేని దేవిశ్రీ బాధ్యతలు స్వీకరించారు. పొన్నూరు సమీపంలోని కాకుమాను మండలం, పోతివానిపాలెం గ్రామానికి చెందిన ఆమె తాత దొంతినేని సత్యనారాయణ పొన్నూరు పట్టణంలోని విద్యానగర్‌లో స్థిరపడ్డారు. సత్యనారాయణ కుమారుడు దొంతినేని శ్రీనివాస్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌. ఆయన సతీమణి అనుపమ రేడియాలజిస్ట్‌.  1993లో అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. వారి కుమార్తె దేవిశ్రీ యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా నేవీ అకాడమీ నిర్వహించిన ఎంట్రస్‌ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించి బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ విభాగంలో యూజీ, పీజీ విద్యను అభ్యసించింది. అనంతరం నావీ పైలెట్‌ అధికారిణిగా ఎంపికైంది. యూఎస్‌ నేవీ పైలెట్‌ అధికారిణిగా పొన్నూరు మూలాలకు చెందిన దేవిశ్రీ ఎంపికవడంపై ఆమె కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పొన్నూరు ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేవిశ్రీ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - 2020-05-23T16:57:37+05:30 IST