Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్పాలు, పార్లర్‌లలో cross gender మసాజ్‌పై నిషేధం

గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ సంచలన ఉత్తర్వులు

గౌహతి : అసోం రాష్ట్రంలోని గౌహతి నగర మున్సిపల్ కార్పొరేషన్ క్రాస్ జెండర్ మసాజ్‌పై సంచలన నిర్ణయం తీసుకుంది. అసోం రాష్ట్ర రాజధాని నగరమైన గౌహతిలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పాలు, సెలూన్లు, పార్లర్‌లలో క్రాస్ జెండర్ మసాజ్ పద్ధతిని నిషేధిస్తూ గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.యునిసెక్స్ సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలలో జరుగుతున్నదుష్ప్రవర్తనలను రూపుమాపేందుకు క్రాస్ జెండర్ మసాజ్ పై నిషేధం విధించినట్లు గౌహతి మున్సిపల్ కమిషనర్ దేవాశిష్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రజా నైతికత,పౌర సమాజాన్ని నియంత్రించే చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని కమిషనర్ పేర్కొన్నారు. 

పౌర సమాజానికి హాని కలిగించే క్రాస్ జెండర్ మసాజ్, వ్యభిచారాన్ని నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. కొత్త నిబంధనల ప్రకారం గౌహతిలోని పార్లర్‌లు, స్పాలకు ప్రత్యేక గదులు ఉండకూడదు.వీటి ప్రధాన ద్వారాలు పారదర్శకంగా ఉండాలి. వ్యతిరేక లింగానికి చెందిన సభ్యులు మసాజ్ సేవలను అందించకుండా నిషేధం విధించారు.మసాజ్ చేసే వారు అర్హత కలిగి ఉండాలని జీఎంసీ ఉత్తర్వులో పేర్కొంది. ఆవిరి స్నానాలను అనుమతించినా క్రాస్ జెండర్లు మాత్రం సహాయం చేయలేరు.మసాజ్ పార్లర్లు, స్పాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేర క్రాస్ జెండర్ మసాజ్ పై నిషేధం విధించామని కమిషనర్ శర్మ చెప్పారు.


గౌహతిలో దాదాపు 60శాతం బ్యూటీ పార్లర్లు, స్పాలు రిజిస్టరు చేయకుండా చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్నారని కమిషనర్ శర్మ చెప్పారు.కొత్త నిబంధనలకు అనుగుణంగా నగరంలో బ్యూటీ పార్లర్లు, హెయిర్ కటింగ్ సెలూన్లు , స్పాలకు నెల రోజుల సమయం ఇచ్చామని, నిబంధనలను ఉల్లంఘించిన వారి లైసెన్స్‌లు పునరుద్ధరించమని శర్మ చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement