Advertisement
Advertisement
Abn logo
Advertisement

సరిగ్గా 6 నెలల క్రితం పెళ్లి.. భార్యతో దిగిన ఈ సెల్ఫీయే చివరిది అవుతుందని ఆ కానిస్టేబుల్ ఊహించలేకపోయాడు.. అసలేం జరిగిందంటే..

ఆ పోలీస్ కానిస్టేబుల్ తాను కర్వాచౌతా పండుగనాడు భార్యతో తీసుకున్న సెల్ఫీయే చివరిది అవుతుందని ఊహించలేకపోయాడు. ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పరిధిలో చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం కానిస్టేబుల్ దేవేంద్రకు వివాహం జరిగింది. అక్టోబరు 24న అతని భార్య వైశాలి భర్త క్షేమం కోరుతూ తొలి కర్వా చౌతా వ్రతం చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం చనిపోవడానికి 24 గంటల ముందు దేవేంద్ర తన స్నేహితుడు అభిషేక్‌కు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు. బర్త్ డే పార్టీ కోసం తాను గ్వాలియర్‌కు వస్తున్నట్లు చెప్పారు. దేవేంద్ర తన తండ్రి కోరిక మేరకు పోలీస్ కానిస్టేబుల్ అయ్యారు. 26 ఏళ్ల దేవేంద్ర ఇకోదియా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అతని స్నేహితుడు నీరజ్ శర్మ కూడా ఇదే పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. దేవేంద్ర, నీరజ్ కుటుంబాలు షాజ్‌పూర్‌లో ఉంటాయి. దీపావళి పండుగ చేసుకునేందుకు ఈ రెండు కుటుంబాలు కారులో గ్వాలియర్ బయలు దేరాయి. ఆ సమయంలో వాహనాన్ని నీరజ్ నడుపుతున్నారు. అతని పక్కసీటులో దేవేంద్ర కూర్చున్నారు. దేవేంద్ర భార్య వైశాలి(24) నీరజ్ భార్య అల్కాలు తమ పిల్లలతో పాటు కారులోని వెనుక సీటులో కూర్చున్నారు. 

గునాలోని బీనాగంజ్ చేరుకున్నంతలో వీరి కారు అదుపుతప్పి, డివైడర్‌ను దాటి అటువైపు ఉన్న వంతెన మీద నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ దేవేంద్రతోపాటు నీరజ్ భార్య అల్కా, వారి కుమార్తె ప్రియాంశీలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. నీరజ్, దేవేంద్ర భార్య చిన్నారి అన్‌మోల్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు గ్వాలియర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్‌లో దేవేంద్ర స్నేహితుడు అభిషేక్ యాదవ్ ఉంటున్నారు. అతని బర్త్ డే పార్టీకి హాజరయ్యేందుకు ఈ రెండు కుటుంబాలు కారులో బయలుదేరాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement