పదేళ్లుగా ఆవాసం.. వసతులేమో మృగ్యం

ABN , First Publish Date - 2021-08-02T06:19:27+05:30 IST

మండలకేంద్రానికి శివారులో ఉన్న ఇందిరమ్మ కా లనీలో మౌళిక సదుపాయాలు కరువై సమస్యలు తిష్ట వేశాయి. పదేళ్ల క్రి తం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు పలువురు పేదలకు ఈ ప్రాంతంలో ఇంటి పట్టాలను అందించి ఇళ్లను కూడా నిర్మించారు.

పదేళ్లుగా ఆవాసం.. వసతులేమో మృగ్యం
ఇందిరమ్మ కాలనీలో అధ్వానంగా వున్న రహదారి


కణేకల్లు, ఆగస్టు 1 : మండలకేంద్రానికి శివారులో ఉన్న ఇందిరమ్మ కా లనీలో మౌళిక సదుపాయాలు కరువై సమస్యలు తిష్ట వేశాయి. పదేళ్ల క్రి తం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు పలువురు పేదలకు ఈ ప్రాంతంలో ఇంటి పట్టాలను అందించి ఇళ్లను కూడా నిర్మించారు. కానీ   సదుపాయాల కల్పనను పూర్తిగా గాలికి వదిలేశారు. దీంతో ఇక్కడ ని వాసం ఉంటున్న ప్రజలు అష్టకష్టాలుపడుతూ జీవనాన్ని  కొనసాగిస్తున్నా రు. కాలనీలో వున్న గృహాల చుట్టూ విపరీతంగా ముళ్లకంపలు పెరిగాయి. ప్రతి రోజూ పాములు, తేళ్లతోనే సావాసం చేయాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిపాటి వర్షం వస్తేనే కాలనీమొత్తం బురదమయంగా తయారై అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి వుంటోంద ని చెబుతున్నారు. ఇళ్ల చుట్టుపక్కలంతా అపరిశుభ్రత వాతావరణం నెలకొని పాములు, తేళ్లు ఇళ్లలోకి వస్తుండటంతోభయంగా జీవనం గడుపుతున్నామని కాలనీకు చెందిన పలువురు ప్రజలు పేర్కొన్నారు. 


గుంతలమయమైన రోడ్లు

ఇందిరమ్మ కాలనీకి హెచ్చెల్సీ కాలువపై నుంచి వెళ్లాలి.  గుంతలమయమైన రోడ్డు నుంచి కాలనీకి వెళ్లాల్సిన పరిస్థితి. వర్షాకాలంలో హెచ్చెల్సీ కాలువపై బురద, నీటి కుంటలతో కాలనీకి చేరుకోవాలంటేనే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. కాలనీలోనూ బురదమయంగా వున్న రోడ్లు తప్పా సి మెంటు రోడ్లు లేని లేవు. ఒక ఇంటి నుంచి మరొకరి ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితి వుంటోంది. రోడ్లు, అపరిశుభ్రతపై పలుమార్లు పాలకులు, అధికారులకు చెప్పినా పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు వాపోయా రు. ఇప్పటికైనా స్పందించి ఇందిరమ్మ కాలనీపై దృష్టి సారించి మౌళిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2021-08-02T06:19:27+05:30 IST