Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు వెళ్లాడు.. అక్కడ జరిగిన అవమానం తట్టుకోలేక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు!

వారిద్దరికీ వివాహం జరిగి 11 ఏళ్లు.. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.. అన్ని సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నా వారి మధ్య అనుబంధం పెరగలేదు.. తరచుగా గొడవలాడుకోవడం.. ఆమె అలిగి పుట్టింటికి వెళ్లిపోవడం.. అతను బతిమాలి తిరిగి తీసుకురావడం సర్వసాధారణమైపోయాయి.. ఇటీవల కూడా ఎప్పటిలాగానే గొడవ జరిగింది.. ఆ గొడవ పెద్దదిగా మారడంతో అతను ఏకంగా ప్రాణాలే తీసుకున్నాడు.. హర్యానాలోని హిసార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


హిసార్ జిల్లాలోని బర్వాలా గ్రామానికి చెందిన బిరూ సింగ్, నూరి దంపతులకు నలుగురు పిల్లలు. 11 ఏళ్ల వీరి వైవాహిక జీవితంలో తరచుగా గొడవలు జరుగుతుండేవి. గొడవ జరిగినప్పుడల్లా నూరి పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయేది. ఈ నెల 20న కూడా వారి మధ్య గొడవ జరిగింది. అలిగిన నూరి పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. వారం రోజులు వేచి చూసిన బిరూ ఆదివారం ఆమె దగ్గరకు వెళ్లాడు. పిల్లలను తీసుకుని ఇంటికి వచ్చెయ్యమని వేడుకున్నాడు. 


అందుకు నూరి నిరాకరించింది. ఆమె తల్లిదండ్రులు మహబల్, కృష్ణ దంపతులు కూడా ఆ గొడవలో కలగచేసుకున్నారు. బిరూపై గొడవకు దిగి అతడిని అవమానించారు. ఆ అవమానం తట్టుకోలేకపోయిన బిరూ ఇంటికి తిరిగి వెళ్లి విషం తాగేశాడు. ఆస్పత్రికి తరలించే సరికే ప్రాణాలు కోల్పోయాడు. బిరూ సోదరుడు రామావతార్ ఫిర్యాదు మేరకు పోలీసులు నూరి, ఆమె తల్లిదండ్రులపై కేసు నమోదు చేశారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement