Advertisement
Advertisement
Abn logo
Advertisement

2020లో అతను తమ తమ్ముని చెంప చెళ్లుమనిపించాడు... పగతో రగిలిపోతున్న అన్నదమ్ములు.. ఇప్పుడు ఏం చేశారంటే..

హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఏడాది క్రితం సోదరుడిని చెంప దెబ్బ కొట్టినందుకు అతని అన్నమ్ములు ఇప్పుడు అతనిపై ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ అన్నదమ్ములు రోడ్డు మధ్యలో అతనిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. స్థానికులు బాధితుడిని కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే ఆ అన్నదమ్ములు అతని కాళ్లను విరగ్గొట్టేవరకూ వెనుకాడలేదు. తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఒక నిందితుడు పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను పోలీసులు ప్రశ్నించిన దరిమిలా ఈ ఘటన వెనుకగల పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత ఘటనలో బాధితుడైన యువకుడు.. నిందితుల తమ్ముడిపై ఏడాది క్రితం దాడి చేశాడు. దీనికి ప్రతీకారంగానే ఆ సోదరుని అన్నదమ్ములు ఇప్పుడు ఆ యువకునిపై ప్రతీకారం తీర్చుకున్నారు. కాగా నిందితులను ఫతేపూర్ చందీలా గ్రామానికి చెందిన లలిత్, ప్రదీప్‌లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఉదంతం గురించి డీఎస్పీ నితీష్ అగర్వాల్ మాట్లాడుతూ బాధితుడు మనీష్ 2020లో యోగేష్ అనే యువకునిపై దాడి చేశాడు. అప్పట్లో ఈ ఉదంతంపై కేసు నమోదయ్యింది. దీనికి ప్రతీకారంగా యోగేష్ సోదరులు ఇప్పుడు మనీష్‌పై దాడి చేశారన్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని నితీష్ అగర్వాల్ తెలిపారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement