6 గంటల కల్లా అన్నీ బంద్... హర్యానా ప్రభుత్వం ఆదేశాలు...

ABN , First Publish Date - 2021-04-22T23:40:42+05:30 IST

ఇటీవల కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరగడంతో హర్యానా ప్రభుత్వం ఆంక్షలు మరింత కఠినతరం చేసింది...

6 గంటల కల్లా అన్నీ బంద్... హర్యానా ప్రభుత్వం ఆదేశాలు...

చండీగఢ్: ఇటీవల కొవిడ్-19 కేసులు విపరీతంగా పెరగడంతో హర్యానా ప్రభుత్వం ఆంక్షలు మరింత కఠినతరం చేసింది. సాయంత్రం 6 గంటల కల్లా అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. అత్యవసరం లేని సమావేశాలన్నిటిపైనా నిషేధం విధించింది. శుక్రవారం నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర హోం, ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. ‘‘రేపట్నుంచి హర్యానాలో సాయంత్రం 6 గంటలకల్లా అన్ని దుకాణాలు మూసివేయడం జరుగుతుంది. అత్యవసరం కాని సమావేశాలన్నీ నిషేధిస్తున్నాం. సూచించిన దానికంటే ఎక్కువ మంది పాల్గొనే వేడుకలకు సంబంధిత సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది...’’ అని విజ్ ట్వీట్ చేశారు. ఇళ్లలో 50 మంది, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది కంటే ఎక్కువ మంది సమావేశం కారాదంటూ ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం పరిమితులు విధించింది. హర్యానాలో పది రోజుల క్రితమే రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతోంది. 

Updated Date - 2021-04-22T23:40:42+05:30 IST