పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన నవవధువు.. విడాకుల కేసుల చరిత్రలోనే అనూహ్య పరిణామం..!

ABN , First Publish Date - 2021-09-12T00:54:16+05:30 IST

పెళ్లై ఏడాది గడిచాక మాత్రమే దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు..హిందు వివాహ చట్టంలో ఉన్న ముఖ్య నిబంధన ఇది. అయితే.. పెళ్లైన మూడో రోజునే విడిపోదామనుకున్న ఓ జంటకు పంజాబ్ హరియాణా హైకోర్టు తాజాగా విడాకులు మంజూరు చేసింది.

పెళ్లయిన మూడో రోజే పుట్టింటికి వెళ్లిపోయిన నవవధువు.. విడాకుల కేసుల చరిత్రలోనే అనూహ్య పరిణామం..!

ఇంటర్నెట్ డెస్క్: పెళ్లై ఏడాది గడిచాక మాత్రమే దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు..హిందు వివాహ చట్టంలో ఉన్న ముఖ్య నిబంధన ఇది. అయితే.. పెళ్లైన మూడో రోజునే విడిపోదామనుకున్న ఓ జంటకు  పంజాబ్ హరియాణా హైకోర్టు తాజాగా విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లైన ఏడాది తరువాతే విడాకులకు దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన నుంచి ఈ జంటకు మినహాయింపు ఇవ్వచ్చని కూడా పేర్కొంది.  ఆసక్తికరమైన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే..


హరియాణాకు  చెందిన ఓ జంటకు 2021 ఫిబ్రవరి 15న వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం వారు పెళ్లి చేసుకున్నారు.  రెవారీలో కాపురం పెట్టారు. కానీ.. ఫిబ్రవరి 17 వరకే భార్యాభర్తలుగా కలిసున్న వారు.. ఆ తరువాత విడిపోయారు. ఇటీవల వారు విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.  పరస్పర అంగీకరాంతో తాము విడిపోదలుచుకున్నామంటూ హిందూ వివాహ చట్టం సెక్షన్ -13బీ కింద ఉమ్మడిగా పిటిషన్ వేశారు. అంతేకాకుండా.. పెళ్లైన ఏడాది గడిచాకే విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్న సెక్షన్-14 నిబంధనను నుంచి కూడా తమకు మినహాయింపు ఇవ్వాలన్ని కోర్టును అభ్యర్థించారు. కానీ.. న్యాయస్థానం మాత్రం వారికి విడాకులు మంజూరు చేయలేదు. వారి పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు జులై 9న తీర్పు వెలువరించింది.

ఇవీ చదవండి..
గర్భాన్ని తీసేయొద్దు.. నేను పెళ్లి చేసుకుంటానన్న యువకుడు.. నో చెప్పిన యువతి.. చివరకు వీళ్ల కథ ఎంత దూరం వెళ్లిందంటే..
అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. బైక్‌పై ఇంటి దగ్గరకు చేరుకోగానే ఊహించని ట్విస్ట్.. అతడికి మైండ్ బ్లాక్..!


దీంతో వారు ఇటీవల పంజాబ్ హరియాణా హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీలుపై విచారణ చేపట్టిన కోర్టు ఆ యువతీయువకుల వాదనతో ఏకీభవించింది. కేవలం రెండు రోజుల పాటే వారు భార్యాభర్తలుగా ఉన్నారు కాబట్టి.. సెక్షన్ -14 నుంచి వీరికి మినహాయింపు ఇవ్వొచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. పెళ్లి సందర్భంగా ఇచ్చిపుచ్చుకున్న బహుమతులన్నీ వెనక్కివచ్చేసినట్టు ఇరువురూ పేర్కొన్న విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. భవిష్యత్తులోనూ అవతలివారి నుంచి ఎటువంటి భరణం ఆశించబోమని ఇరువురూ తమ పిటిషన్లో పేర్కొన్న నేపథ్యంలో కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. 

Updated Date - 2021-09-12T00:54:16+05:30 IST