Abn logo
Aug 2 2021 @ 00:53AM

వణ్య ప్రాణిని నరికి చంపిన దుండగులు

కణుజు మొండేన్ని పరిశీలిస్తున్న అధికారులు

 వేర్వేరుచోట్ల  తల, మొండెం 

 గొల్లలపాలెం తోటలో దారుణం

 ఘటనా స్థలాన్ని పరిశీలించిన 

పోలీసు, అటవీ అధికారులు 

ఎలమంచిలి, ఆగస్టు 1: మునిసిపాలిటీ పరిధి గొల్లలపాలెం సమీపంలోని తోటలో దారుణం చోటుచేసుకుంది. అత్యంత కిరాతకంగా వణ్యప్రాణి (కణుజు)ని నరికి చంపడమే కాకుండా తల, మొండేన్ని గుర్తు తెలియని వ్యక్తులు వేర్వేరుగా పడవేయడంతో ఈ దృశ్యాన్ని చూసిన వారంతా కంటతడి పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి ఈ ఘటన పట్టణంలో సంచలనంగా మారింది. దీనిపై రూరల్‌ పోలీసులకు స్థానికులు సమాచారం అందించడంతో ఎస్‌ఐ సన్నిబాబు, అటవీ శాఖాధికారులు వేణుకుమారి, సత్యనారాయణమూర్తి వచ్చి కుణుజును పరిశీలించారు. అటవీ శాఖాధికారులు మాట్లాడుతూ కణుజును నరికి చంపినట్టు గుర్తించామన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు.