Abn logo
Jan 14 2021 @ 12:24PM

ఒవైసీ మాకు బెంగాల్‌లోనూ సహకరిస్తారు : సాక్షి మహారాజ్

న్యూఢిల్లీ : ఎంఐఎం అధినేత ఒవైసీ బెంగాల్‌లో పోటీ చేయడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బెంగాల్ బరిలోకి దిగడం బీజేపీకే కలిసొస్తుందని వ్యాఖ్యానించారు. మరి యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేయడంపై కూడా స్పందించారు. ‘‘అది దేవుడి దయ. దేవుడు అతనికి బలాన్నిస్తాడు. అతను మాకు బిహార్‌లో సహాయం చేశాడు. యూపీలో చేశాడు. ఇప్పుడు బెంగాల్‌లోనూ సహాయం చేస్తాడు.’’ అని సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ మహారాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఒవైసీ బీజేపీకి ‘బీ టీమ్’ అని విమర్శించారు. 

Advertisement
Advertisement
Advertisement