నిప్పుల కుంపటిలా రాజస్థాన్... 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతతో..

ABN , First Publish Date - 2020-05-24T04:55:40+05:30 IST

రాజస్థాన్‌లో ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భగ్గుమన్నాయి. చురులో 46.6 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ..

నిప్పుల కుంపటిలా రాజస్థాన్... 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతతో..

జైపూర్: రాజస్థాన్‌లో ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భగ్గుమన్నాయి. చురులో అత్యధికంగా 46.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కోటాలో పగటి పూట 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. జైసల్మేర్, బికీనీర్ ప్రాంతాల్లో 44.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు బర్మేర్, గంగానగర్ ప్రాంతాల్లో వరుసగా 45.9 డిగ్రీలు, 44.1 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అజ్మేర్, దాబోక్ (ఉదయ్‌పూర్) ప్రాంతాల్లో వరుసగా 42.4 డిగ్రీలు, 41.2 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం కూడా ఎండలు ఇదే స్థాయిలో కొనసాగుతాయని తెలిపింది. 

Updated Date - 2020-05-24T04:55:40+05:30 IST