కిరాణ దుకాణంలో పట్టుబడిన గుట్కా సంచులు
బిచ్కుంద, జనవరి 16: బిచ్కుందలో స్పెషల్ ట్రాస్క్ఫోర్స్ అధికారులు పెద్ద మొత్తం లో గుట్కాను పట్టుకున్నారు. శనివారం మండల కేంద్రంలోని కిరాణా దుకాణాల్లో ఎస్ఐ ఉస్మాన్ బృందం తనిఖీలు చేయగా హన్మాండ్లు కిరాణ దుకాణంలో రూ.లక్ష గుట్కా బ్యాగ్లు, లక్ష్మీనారాయణ దుకాణంలో ఇరువై వేల గుట్కా ప్యాకెట్లు లభించినట్లు అధికా రులు తెలిపారు. వాటన్నింటిని స్వాధీనం చేసుకున్న అధికారులు కిరాణ దుకాణాలలో గుట్కా అమ్మకానికి పాల్పడితే సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సాయన్న, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.